బిహార్ తొలిదశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు | Bihar First Phase Elections 2025 Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు

బిహార్ ఎన్నికల చరిత్రలో అత్యధిక ఓటింగ్ : సీఈసీ

  • బిహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈరోజు ప్రశాంత వాతావరణంలో, పండుగలా జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 64.66 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు.
  • ప్రధాన ఎన్నికల కమిషనర్  గ్యానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డా. సుఖ్బీర్ సింగ్ సాంధు, డా. వివేక్ జోషి లతో కలిసి 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో అమలైన లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించారు.
  • రాష్ట్రంలోని 18 జిల్లాలకు చెందిన 121 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది
2025-11-06 21:32:17

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు

  • బిహార్ తొలిదశ పోలింగ్‌ 64.66% పోలింగ్ నమోదు
  • గత ఎన్నికలతో పోలిస్తే తొమ్మిది శాతం పెరిగిన పోలింగ్
  • భారీ సంఖ్యలో ఓటేసిన మహిళా ఓటర్లు
  • 20 ఏళ్ల తర్వాత భారీ స్థాయి ఓటింగ్ నమోదు
  • 2020 ఎన్నికల్లో 56% పోలింగ్ నమోదు
2025-11-06 21:17:15

  • ఎట్టకేలకు దిగివచ్చిన సివాన్‌లోని గరౌలీ ఓటర్లు
  • సాయంత్రం 5.30కు అధికారులు ఒప్పించడంతో ఓటు వేసేందుకు సిద్ధమైన ప్రజలు
  • కరెంటు లేకపోవడంతో.. టార్చ్‌లైట్ల వినియోగం
  • ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు
  • సాయంత్రం 6 గంటల వరకు వరసలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశమిస్తామని వెల్లడి
2025-11-06 18:03:08

బిహార్‌లో ముగిసిన తొలి విడుత ఎన్నికల పోలింగ్‌

  • బిహార్‌లో ముగిసిన తొలి విడుత ఎన్నికల పోలింగ్‌
  • 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌
  • సాయంత్రం ఐదుగంటల సమయానికి 60.13 శాతం పోలింగ్ నమోదు
  • నవంబర్‌ 11న 122 అసెంబ్లీ స్థానాలకు రెండో దశ ఎన్నికల పోలింగ్‌ 
2025-11-06 18:03:08

సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ నమోదు

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడతలో సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం పోలింగ్ నమోదు
  • రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వెలుగులోకి వచ్చిన డేటా 
  • డేటా ప్రకారం ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిన ఓటర్లు
  • మాధేపురాలో అత్యధికంగా 65.74 శాతం 
  • సహర్సాలో 62.65 శాతం 
  • దర్భంగాలో 58.38 శాతం
  • ముజఫర్ పూర్‌లో 65.23 శాతం
  • గోపాల్ గంజ్‌లో 64.96 శాతం 
  • సివాన్‌లో 57.41 శాతం 
  • సరన్‌లో 60.90 శాతం 
  • వైశాలిలో 59.45 శాతం 
  • సమస్తిపూర్‌లో 66.65 శాతం 
  • బెగుసరాయ్‌లో 67.32 శాతం 
  • ఖగారియాలో 60.65 శాతం  
  • ముంగేర్‌లో 54.90 శాతం 
  • లఖిసరాయ్‌లో 62.76 శాతం 
  • షేక్ పురాలో 52.36 శాతం 
  • నలందలో 57.58 శాతం 
  • పాట్నాలో 55.02 శాతం 
  • భోజ్ పూర్‌లో 53.24 శాతం  
  • బక్సర్‌లో 55.10 శాతం పోలింగ్ నమోదైంది
  • అత్యధికంగా బెగుసరాయ్‌లో పోలింగ్ నమోదైనట్లు తేల్చిన డేటా 
2025-11-06 17:53:16

సీఆర్పీఎఫ్ జవాన్లపై రాళ్లు విసిరిన ఆర్జేడీ మద్దతుదారులు

  • వైశాలిలో సీఆర్పీఎఫ్ జవాన్లపై రాళ్లు రువ్విన ఆర్జేడీ మద్దతుదారులు
  •  వైశాలిలో ఆర్జేడీ అభ్యర్థిని రెచ్చగొట్టడంతో  సీఆర్పీఎఫ్ జవాన్లపై రాళ్లు  రువ్విన ఆ పార్టీ మద్దతు దారులు
  • వాస్తవానికి ఆర్జేడీ అభ్యర్థి తన మద్దతుదారులతో గుమిగూడగా, జవాన్లు వారిని తొలగించడంతో చెలరేగిన గందరగోళం.. రాళ్ల రువ్విన వైనం
  • ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.
2025-11-06 17:14:30

గోరేయకోఠిలో వివాదం.. నిరసన

సివాన్‌లోని గోరేయకోఠి అసెంబ్లీ నియోజకవర్గంలో వివాదం
కలకా నవీగంజ్ బ్లాక్ లోని 349, 350 లక్డీ మక్తాబ్ బూత్‌కు బీజేపీ అభ్యర్థి దేవేష్ కాంత్ సింగ్
బుర్ఖాను తొలగించాలని ముస్లిం మహిళా ఓటర్లను కోరినట్లు ఆరోపణలు
దీంతో స్థానిక ఓటర్లు తీవ్ర నిరసన
'ఓటు చోర్ గడ్డీ చోడో' అంటూ నినాదాలు చేసిన ప్రజలు
 

2025-11-06 16:22:25

బిహార్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 53.7 శాతం పోలింగ్‌ నమోదు

తొలి విడతలో 121 స్థానాలకు 53.77 శాతం పోలింగ్ నమోదు
మొదటి దశలో గురువారం 18 జిల్లాల్లో సగటున 53.77 శాతం పోలింగ్
బెగుసరాయ్ లో అత్యధికంగా 59.82 శాతం పోలింగ్ నమోదు
రాజధాని పాట్నాలో అత్యల్పంగా 48.69 శాతం పోలింగ్ నమోదు
ముజఫర్ పూర్ (58.40 శాతం)
గోపాల్ గంజ్ (58.87 శాతం)
లఖిసరాయ్ (57.39 శాతం)
సమస్తిపూర్ (56.35 శాతం)
ఖగారియా (54.77 శాతం)
సరన్ (54.60 శాతం)
వైశాలి (53.63 శాతం)
నలంద (52.32 శాతం)
ముంగేర్ (52.17 శాతం)
బక్సర్ (51.69 శాతం)
భోజ్ పూర్ (50.07 శాతం)
సివాన్ (50.93 శాతం)
షేక్ పురా (49.37 శాతం)
మాధేపురా (55.96 శాతం)
సహర్సా (55.22 శాతం)
దర్భంగా (51.75 శాతం) పోలింగ్ నమోదు
ఇప్పటివరకు ఓటింగ్ సమయంలో 100కు పైగా ఫిర్యాదులు
అదే సమయంలో 300కు పైగా ఈవీఎంలు మార్పు

2025-11-06 15:58:17

2025-11-06 15:54:48

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం

  • ఓటింగ్ ఫొటో తీసిన యువకులు

  • వైశాలి జిల్లా మహువా అసెంబ్లీ నియోజకవర్గంలో యువకుడి అరెస్ట్‌ 

  • పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎం ఫొటో తీస్తున్నట్లు ఆరోపణలు  

  • యువకుణ్ని అదుపులోకి తీసుకున్న పోలింగ్‌ సిబ్బంది

  • పోలీసులకు అప్పగింత

  • వీరితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు 

  • వీరు అక్రమంగా పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఓటువేసినట్లు అనుమానం   

2025-11-06 15:46:43

బీజేపీ అభ్యర్థి దేవేష్ కాంత్ సింగ్‌కు షాక్‌

  • సివాన్‌లోని గోరేయకోఠి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల ఆందోళన
  • కలకా నవీగంజ్‌లో బూత్‌ నెంబర్‌ 349, 350 వద్ద స్థానిక ఓటర్ల నినాదాలు
  • బీజేపీ అభ్యర్థి దేవేష్ కాంత్ సింగ్ వ్యతిరేకిస్తూ ఆందోళన
2025-11-06 15:46:43

ఓటరు జాబితాలో 150 మంది పేర్ల గల్లంతు

  • బిహార్‌లో ఓట్ల గల్లంతు
  • ఓటరు జాబితాలో 150 మంది పేర్ల గల్లంతు
  • చాప్రా అసెంబ్లీలో ఓటరు జాబితాలో 150 మంది పేర్ల గల్లంతు
  • బ్రహ్మపూర్ ప్రాంతానికి చెందిన 150 మంది ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో మిస్సింగ్‌
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు 
2025-11-06 15:46:43

  • లఖిసరాయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి,డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కారుపై రాళ్ల దాడి

  • కాన్వాయ్‌పై చెప్పులు విసిరిన అగంతకులు

  • ముర్దాబాద్ నినాదాలు చేస్తూ సిన్హా కారు అడ్డగింత

  • గుంపులో ఆర్జేడీ గూండాలు ఉన్నారని డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపణలు  

  • గూండాలు నన్ను గ్రామానికి వెళ్లనివ్వడం లేదు. వారు నా పోలింగ్ ఏజెంట్‌ను తరిమికొట్టారు

  • అతన్ని ఓటు వేసేందుకు అనమతించలేదని ఆగ్రహం 

2025-11-06 15:07:49

కొనసాగుతున్న పోలింగ్‌..

  • కొనసాగుతున్న పోలింగ్‌..
  • బిహార్‌లో పోలింగ్‌ కొనసాగుతోంది.
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42.31 శాతం పోలింగ్‌ నమోదు.. 
2025-11-06 14:02:26

ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్‌

  • బిహార్‌లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.
  • ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్‌ నమోదు.
  • పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. 
  • ఇప్పటికే పలువురు ప్రముఖులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

 

2025-11-06 12:16:40

అరుదైన చిత్రాలు..

  • పోలింగ్‌ వేళ అరుదైన చిత్రాలు..
  • వైశాలిలో కొడుకు తన తల్లిని ఒడిలో పెట్టుకుని ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు చేరుకున్న యువకుడు
  • ముజఫర్‌పూర్‌లో ఓటర్లు ఓటు వేయడానికి పడవలో వెళ్తున్న దృశ్యం

వైశాలిలోని భగవాన్ పూర్ లో ఓటరు కేదార్ ప్రసాద్ యాదవ్ ఓటు వేయడానికి వచ్చాడు. కేదార్ యాదవ్ మాట్లాడుతూ, "వాహనాలు మూసివేయబడ్డాయి, కాబట్టి మేము మా స్వారీ గేదె మీద వచ్చాము. నా బూత్ ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ నేను ఓటు వేయబోతున్నాను.

ముజఫర్ పూర్ లో ఓటర్లు ఓటు వేయడానికి పడవలో వెళ్తున్న దృశ్యం

వైశాలిలో కొడుకు తన తల్లిని ఒడిలో పెట్టుకుని ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు చేరుకున్న యువకుడు

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

2025-11-06 11:23:31

ప్రిసైడింగ్ అధికారికి అస్వస్థత..

  • ప్రిసైడింగ్ అధికారికి అస్వస్థత..
  • ఫతుహా అసెంబ్లీలోని హాజీపూర్ గ్రామంలోని బూత్ నంబర్ 254లో కలకలం.
  • ఉన్నట్లుండి కుప్పకూలిపోయిన ప్రిసైడింగ్ అధికారి.
  • ఆస్పత్రికి తరలింపు.
     
2025-11-06 11:23:31

అక్కడ ఐదు గంటల వరకే పోలింగ్‌..

  • అక్కడ ఐదు గంటల వరకే పోలింగ్‌..
  • భద్రతా కారణాల దృష్ట్యా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ సమయం తగ్గింపు.
  • సిమ్రీ బఖ్తియార్పూర్, మహిషి, తారాపూర్ (ముంగేర్ జిల్లా), జమాల్‌పూర్‌లో ఐదు గంటల వరకే పోలింగ్‌.
2025-11-06 11:23:31

ఓటింగ్ బహిష్కరించిన ప్రజలు..

  • ఓటింగ్  బహిష్కరించిన ప్రజలు.
  • ముజఫర్‌పూర్‌లోని మూడు బూత్‌లలో ఓటింగ్  బహిష్కరించిన ప్రజలు.
  • గైఘాట్ విధాన సభలోని మూడు బూత్‌లలో ఘటన.
  • బూత్ నంబర్ 161, 162, 170 వద్ద వంతెనలు, రోడ్ల నిర్మాణం జరపడం లేదని ఓటర్ల నిరసన
  • దర్భంగాలో రోడ్లు, ఓట్లు వేయవద్దని గ్రామస్తులు తీర్మానించారు.
  • దర్భంగాలోని కుశేశ్వరస్థాన్ ఈస్ట్ బ్లాక్ పరిధిలోని సుగ్రైన్ గ్రామ ఓటర్లు ఓటును బహిష్కరించారు.
  • రోడ్డు లేకపోతే ఓటు వేయవద్దని గ్రామస్తుల నిరసన.
  • ప్రజలకు వివరించడానికి సీవో గోపాల్ పాశ్వాన్, బీడీవో ప్రభ శంకర్ మిశ్రా వచ్చారు.
2025-11-06 11:23:31

ఓటు వేసిన తేజ్‌ ప్రతాప్‌

  • ఓటు వేసిన తేజ్‌ ప్రతాప్‌
  • జనశక్తి జనతాదల్‌ అధ్యక్షుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఓటు వేశారు.
  • పట్నాలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ప్రతీ ఒక్కరి ఓటు ఎంతో విలువైనది.
  • తప్పకుండా అందరూ ఓటు వేయాలి.
  • తల్లిదండ్రుల ఆశీర్వాదాలకు ప్రత్యేక స్థానం ఉంది అంటూ వ్యాఖ్యలు. 
2025-11-06 10:40:39

ఓటు వేసిన సీఎం నితీష్‌

  • ఓటు వేసిన సీఎం నితీష్‌
  • బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • పాట్నలోని పోలింగ్‌ బూత్‌లో నితీష్‌ ఓటు వేశారు.
  • ఓటర్లు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. 
2025-11-06 10:40:39

కొనసాగుతున్న పోలింగ్‌..

  • కొనసాగుతున్న పోలింగ్‌..
  • తొమ్మిది గంటల వరకు 13.13 శాతం పోలింగ్‌ నమోదు
2025-11-06 09:43:40

ఓటు వేసిన లాలూ, రబ్రీ దేవీ..

ఓటు వేసిన లాలూ, రబ్రీ దేవీ..

లాలూ కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 

2025-11-06 08:43:32

ఓటు వేసిన తేజస్వి..

  • ఓటు వేసిన తేజస్వి..
  • తేజస్వీ యాదవ్‌ తన ఓటు వేశారు.
  • పట్నాలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తేజస్వీ
  • బిహార్‌లో నవంబర్‌ 14వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కామెంట్స్‌.. 
2025-11-06 08:38:35

ఓటు వేసిన ప్రముఖులు..

  • ఓటు వేసిన ప్రముఖులు..
  • డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి విజయ్‌ కుమార్‌ సిన్హా
  • కేంద్ర రాజీవ్‌ రంజన్‌.
  • సింగర్‌, నటుడు, ఆర్జేడీ అభ్యర్థి కేశరిలాల్‌ యాదవ్‌.
  • ఓటర్లంతా ఓటు వేయాలని కోరిన అభ్యర్థులు, నేతలు 

 

2025-11-06 08:25:39

కొనసాగుతున్న పోలింగ్‌..

  • కొనసాగుతున్న పోలింగ్‌..
  • తొలి దశలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది.
  • ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.
  • పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

 

2025-11-06 07:48:32

కొనసాగుతున్న పోలింగ్‌..

  • కొనసాగుతున్న పోలింగ్‌
  • ఓట్లు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.
  •  

 

2025-11-06 07:15:31

ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు

  • ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు
  • బిహార్‌ ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లు
  • ఢిల్లీలోని ఆనంద్ విహార్, ఓల్డ్ ఢిల్లీ, న్యూఢిల్లీ సహా ఇతర ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు
  • పెద్ద సంఖ్యలో బిహార్‌కు చెందిన వలస కూలీలు రాక
  • సోమవారం 32 ప్రత్యేక రైళ్లు నడిచాయని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ ప్రకటన.
  • మూడు కోట్ల మంది బిహారీలు వలస కార్మికులు. 
     
2025-11-06 07:13:24

బరిలో 16 మంది మంత్రులు

  • బరిలో 16 మంది మంత్రులు
  • తొలి విడతలో ప్రధాన కూటముల తరఫున బరిలో పలువురు ప్రముఖులు
  • నితీశ్‌కుమార్‌ సర్కార్‌లోని 16 మంది మంత్రులు
  • ఉపముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరీ, విజయ్‌ కుమార్‌ సిన్హా సహా బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు
  • సామ్రాట్‌ చౌదరీ తారాపుర్‌ నుంచి,
  • విజయ్‌కుమార్‌ సిన్హా లఖిసరాయ్‌ నుంచి పోటీ
  • మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌
  • మాజీమంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ మహువా నుంచి పోటీ
  • రఘునాథ్‌పుర్‌లో దివంగత మహ్మద్‌ షాబుద్దీన్‌ కుమారుడు ఒసామా సాహబ్‌ ఆర్జేడీ తరఫున పోటీ
  • నలందలో జేడీయూ తరఫున ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రవణ్‌ కుమార్‌
  • తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జానపద కళాకారిణి మైతిలీ ఠాకూర్‌ బీజేపీ అభ్యర్థిగా అలీనగర్‌ నుంచి
  • కేసరిలాల్‌ యాదవ్‌గా సుపరిచితుడైన భోజ్‌పుర్‌ నటుడు-గాయకుడు శత్రుఘన్‌ యాదవ్‌ చాప్రా నుంచి పోటీ
     
2025-11-06 07:08:47

ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం 
  • సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్  
2025-11-06 07:03:34

మోదీ విషెస్‌..

  • మోదీ విషెస్‌..
  • బీహార్‌లో ప్రజాస్వామ్య పండుగలో ఈరోజు మొదటి దశ.
  • ఈ దశలో ఉన్న అందరు ఓటర్లకు నా విజ్ఞప్తి
  • ఓట్లర్లు అందరూ పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలి.
  • తొలిసారి ఓటు వేయబోతున్న రాష్ట్రంలోని యువ ఓటర్లందరికీ నా ప్రత్యేక అభినందనలు.
  • ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
2025-11-06 07:01:55

తొలి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు

  • తొలి దశలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు
  • 18 జిల్లాల పరిధిలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్  
  • నవంబర్ 11న రెండవ దశ పోలింగ్
  • నవంబర్ 14న కౌంటింగ్
2025-11-06 06:58:16

తేజస్వీ Vs పీకే

  • రాఘోపూర్‌లో హ్యాట్రిక్‌ కోసం తేజస్వీ
  • 2010లో రబ్రీ దేవిని ఓడించిన బీజేపీ నేత సతీశ్‌ కుమార్‌ ఈసారి తేజస్వీని ఓడించాలని తహతహలా
  • రాఘోపూర్‌లో ఎలాగైనా తేజస్వీని ఓడించాలని ప్రశాంత్‌ కిషోర్‌ ప్లాన్‌
  • తేజ్‌ ప్రతాప్‌ సైతం సొంతంగా జశక్తి జనతాదళ్‌ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
  • విజయ్‌ కుమార్‌ సిన్హా సైతం లఖీసరాయ్‌లో నాలుగోసారి గెలుపుపై ఆశలు.
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీసులు
2025-11-06 06:55:45

కొత్త ఓటర్లు పది లక్షలు..

  • నేడు 45,241 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది.
  • వీటిల్లో 36,733 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం గమనార్హం.
  • ఓటేస్తున్న వారిలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు.
  • తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌
2025-11-06 06:53:30

మాక్‌ పోలింగ్ ప్రారంభం

  • మాక్‌ పోలింగ్ ప్రారంభం
  • నియోజకవర్గాల్లో మాక్‌ పోలింగ్‌ ప్రారంభం
  • కాసేపట్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 

 

2025-11-06 06:51:10

కాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం

  • తొలి దశలో 121 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌
  • అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు
  • అధికార ఎన్‌డీఏ, విపక్షాల మహాగఠ్‌బంధన్‌ కూటమి సహా మొత్తం 1,314 అభ్యర్థులు
  • తొలి దశలో 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధం 
2025-11-06 06:47:22
Advertisement
 
Advertisement
Advertisement