
నిజామాబాద్: తెలంగాణలో సైతం ఓట్ చోరీ జరిగిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మహేష్ కుమార్ ఓట్ చోరీ అంటున్నారు కదా.. ఇది ఓట్ చోరీ కాదు.. రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ మండిపడ్డారు. ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే ఓటర్ లిస్ట్‌తోనే బీజేపీ కూడా గెలిచిందన్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రామ్ చందర్‌రావు.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందనే అంశాన్ని ఇక్కడ రామ్ చందర్‌రావు ప్రస్తావించారు. మరి కాంగ్రెస్ ఎంపీలు సైతం దొంగ ఓట్లతో గెలిచారా? అంటూ ప్రశ్నించారు. ‘ ముస్లింలకు రిజర్వేషన్‌లు పెంచి బీసీల రిజర్వేషన్‌లు తగ్గించే కుట్ర కాంగ్రెస్ చేస్తోంది. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరతకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది.
దీనిపై మంత్రులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, సృష్టిస్తున్న కృత్తిమ కొరత. రాష్ట్రం లో కాంగ్రెస్ నేతలు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా సమస్య పై కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చ కొడుతుంది. ఓటమి భయం తో.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం భయ పడుతుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు..ఈ రెండు పార్టీలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయటం మామూలు విషయం కాదు’ అని రామ్ చందర్ రావు స్పష్టం చేశారు.
కాగా, నిన్న(ఆదివారం, ఆగస్టు 24) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్‌ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు.