42% బీసీ రిజర్వేషన్ల అంశం ముగిసిపోలేదు
త్వరలోనే ప్రధాని అపాయింట్‌మెంట్ అడుగుతాం
బీసీ సంఘాలు బీఆర్‌ఎస్, బీజేపీలను నిలదీయాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధ న పేరుతో నాడు కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించా రు. ఇప్పుడు బీఆర్ ఎస్ ఉనికిని చాటుకు నేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మహేశ్ గౌడ్ శుక్ర వారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజున కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందన్నారు. సోనియా చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని, అమర వీరులకు నివా ళులర్పించాలని చెప్పారు.
అసలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబసభ్యులు కానీ, దూరపు బంధువులు కానీ ఎవరైనా ప్రాణా లు కోల్పో యారా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా దీక్షా దివస్‌లు మాను కోవాలని బీఆర్‌ఎస్‌కు హితవు పలికారు. ‘ఎవరు తెలంగాణ ఇస్తే.. ఎవరు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందన్నది వాస్తవం. పులి నోటిలో తల పెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చా డన్నది మాత్రం అవాస్తవం. కేవలం ఆయన వల్లనే తెలంగాణ రాలేదు’ అని అన్నారు.
అది అటకెక్కలేదు..: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ముగిసిపోలేదని, దాని కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటామని మహేశ్ గౌడ్ చెప్పారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెద్దఎత్తున తగ్గలేదని, కేవలం 0.5 శాతం మాత్రమే తేడా వచ్చిందన్నారు. దీనిపై త్వరలోనే ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు, అయితే, బీసీ సంఘాలు గాంధీభవన్ వద్ద ధర్నాలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు.
‘మీరు వెళ్లాల్సింది బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగిలిన బీజేపీ నేతల ఇళ్లకు. అలాగే, పైకి మద్దతిచ్చి లోపల అడ్డుతగులుతున్న కేటీఆర్, హరీశ్‌రావుల ఇళ్లకు. కిషన్‌రెడ్డి ఇంటి తలుపులు తట్టండి’ అని బీసీ సంఘాలనుద్దేశించి మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. మంత్రి కోమటిరెడ్డిని ఉద్దేశించి నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్ నేత చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని అన్నారు. అయితే, కోమటిరెడ్డిని కలిసి వివరణ ఇచ్చినట్లు కైలాశ్ తనకు చెప్పా రన్నారు. ఎంఐఎం విషయంలో బీజేపీ వ్యాఖ్యలు ఎప్పుడూ ఉండేవేనని, రోజుకు రెండుసార్లు ఎంఐఎంను, ఒవైసీలను తలుచుకోనిదే ఆ పార్టీ నేతలకు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు.


