న్యూయార్క్: ఎనిమిది నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్లిన నలుగురు వ్యోమగాములు గురువారం భూమిపైకి తిరిగి వచ్చారు. అమెరికా, ఫ్రాన్స్, రష్యాకు చెందిన ఈ వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ సంస్థ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో విజయవంతంగా దించింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జెస్సికా మీర్, జాక్ హాతవే, ఫ్రాన్స్‌కు చెందిన సోఫీ అడెనాట్, రష్యాకు చెందిన ఆండ్రీ ఫెడ్యాయెవ్ బుధవారం ఐఎస్‌ఎస్ నుంచి బయలుదేరారు. ఒక్క రోజులోనే భూమిపైకి తిరిగివచ్చారు. మన సొంత గ్రహం ఈ అసాధారణ దృశ్యాలను ఇన్నాళ్లూ తాము కోల్పోయామని మీర్ పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లో అనారోగ్యంతో ఉన్న సిబ్బంది స్థానంలోకి వెళ్లేందుకు ఈ నలుగురు వ్యోమగాములు ఎనిమిది నెలల క్రితం హడావుడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
భూమిపైకి తిరిగి వచ్చిన నలుగురు వ్యోమగాములు
Oct 9 2026 6:03 AM | Updated on Oct 9 2026 6:03 AM
Advertisement


