నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: భారతదేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జనాభా లెక్కల సేకరణ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రకటించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, ప్రతికూల వాతావరణం ఉండే ప్రాంతాలు మినహా దేశమంతటా జన గణన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
అధికారిక ప్రకటన ప్రకారం ఈ జనాభా గణనకు సంబంధించిన రెఫరెన్స్ డేట్‌ను 2027 మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 00:00 గంటలుగా నిర్ణయించారు. మణిపూర్ (తదుపరి ప్రకటన వచ్చేవరకు), గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌తోపాటు లద్ధాఖ్, హిమాచల్‌ప్రదేశ్ జమ్మూకశీ్మర్‌లలోని మంచుతో కప్పబడి ఉండే నాన్–సింక్రోనస్ ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జన గణన చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
జనాభా గణన కోసం ‘సవరణ దశ’2027 మార్చి 1 నుంచి 2027 మార్చి 5వ వరకు జరుగుతుందని పేర్కొ న్నారు. ఇంటింటికీ తిరిగి జనాభాను లెక్కించే ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందుగా.. అంటే 2027 జనవరి 10 నుండి 2027 జనవరి 24వ తేదీ వరకు ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే(సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశం కలి్పంచబోతున్నారు.


