ఆరు నెలల్లో నేనే ఆదిలాబాద్‌కు కమిషనర్‌గా వస్తా.. | Adilabad Property Tax Dues Former Official Interference | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో నేనే ఆదిలాబాద్‌కు కమిషనర్‌గా వస్తా..

Oct 15 2026 1:30 PM | Updated on Oct 15 2026 2:04 PM

Adilabad Property Tax Dues Former Official Interference

AI జనరేటెడ్ ఫోటో

ఆదిలాబాద్‌: పట్టణంలోని అంబేడ్కర్‌చౌక్‌ సమీపంలో గల ప్రైవేట్‌ హోటల్‌కు సంబంధించి పన్ను వసూలుకు వెళ్లిన బల్దియా రెవెన్యూ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. సదరు బకాయిదారు బల్దియాకు రూ.2,48,220 ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే అధికారులు డిమాండ్‌ నోటీసు జారీ చేశారు. వీటి వసూలు కోసం వారం కిందట సంప్రదించగా బుధవారం రావాలని ఆయన సూచించాడు. దీంతో బుధవారం బల్దియా రెవెన్యూ అధికారి కల్యాణ్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐలు, బిల్‌కలెక్టర్‌ సదరు బకాయిదారు వద్దకు వెళ్లారు. 

అయితే ఆ వ్యక్తి ఓ అధికారితో ఫోన్‌లో మాట్లాడగా ‘ఆరు నెలల్లో నేనే ఆదిలాబాద్‌కు కమిషనర్‌గా వస్తా.. మీ ఆస్తిపన్నును తగ్గిస్తా అప్పటిదాకా ట్యాక్స్‌ చెల్లించకండి’ అంటూ సూచించాడు. దీంతో ఆ వ్యక్తి ట్యాక్స్‌ చెల్లించకుండా మొండికేశాడు. చేసేదేం లేక నిరాశగా వెనుదిరిగిన సిబ్బంది జరిగిన విషయాన్ని మున్సిపల్‌ చైర్‌పర్సన్, కమిషనర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ను సంప్రదించగా ఇది వరకు ఇక్కడ పనిచేసిన ఓ అధికారి ట్యాక్స్‌ కట్టకుండా అడ్డుపడ్డ మాట వాస్తవమేనన్నారు. దీనిపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీకే కుటుంబానికి సీటిస్తే ఊరుకోం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement