ఈయన పేరు నాగేశ్వర్‌రావు. కొరటా–చనాఖా ప్రాజెక్ట్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. నవంబర్ 14న హైదరాబాద్‌లో వాటర్‌మ్యాన్ ఆఫ్ ది తెలంగాణ దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు మెమోరియల్ అవార్డు దక్కించుకున్నాడు. అక్కడి ఇంజినీర్స్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్‌లతో పాటు కాలువల నిర్వహణ వివిధ అంశాల పరంగా రైతులకు సాగునీరు అందించడంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఈ గుర్తింపు దక్కింది.
అవార్డు అందుకున్న నాగేశ్వర్‌రావు(ఫైల్)


