నేరడిగొండ: మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో శనివారం పడి పూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎమ్మెల్యే కుమారుడు అర్జున్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి దీక్షాపరులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు, ఆచార్య తేజచక్రవర్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్తోక్త్రంగా నిర్వహించారు. ప్రభాకర్‌రెడ్డి గురుస్వామి, శ్రీకాంత్ ఆరాధ్య భజన బృందం ఆధ్వర్యంలో చేపట్టిన భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే నివాసంలో గణేశ్ హోమం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షిషా సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.


