చదువుతోపాటు హాకీలోనూ రాణిస్తూ జాతీయస్థాయికి ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచారు ఈ బాలికలు. తలమడుగు మండలం భరంపూర్ జెడ్పీఎస్‌ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న బి. మహేశ్వరి, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న వై. నందిత ఎస్జీఎఫ్ అండర్–17 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ఇటీవల ప్రతిభ కనబరిచారు. నవంబర్ 20 నుంచి 22 వరకు వరంగల్‌లో నిర్వహించిన పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. మహేశ్వరి రైట్ బ్యాక్‌గా, నందిత రైట్ ఔట్‌గా రాణిస్తున్నారు. ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి పోటీలు ఒడిశాలో జరగనున్నాయి. జాతీయస్థాయిలోనూ పతకాలు సాధించాలనే లక్ష్యంతో ప్రస్తుతం వీరు సన్నద్ధమవుతున్నారు.
మహేశ్వరి
నందిత


