ఆదిలాబాద్‌టౌన్: జీవించి ఉన్న ఓ టీచర్ మరణించినట్లుగా యూడైస్‌లో నమోదు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారులు, ఉద్యోగుల వైఖరిని వివరిస్తూ ‘సార్.. నేను బతికే ఉన్న’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్ రాజ ర్షి షా స్పందించారు. ఆ శాఖ అధికారుల వైఖరిపై సీరియస్ అయినట్లుగా తెలిసింది. సంబంధిత ప్రధానోపాధ్యాయుడి నుంచి వివరణ తీసుకోవాలని డీఈవో మాధవిని ఆదేశించారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆ పాఠశాల హెచ్‌ఎంను వివరణ కోరారు. దాని ఆధారంగా తగు చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం.
అన్ని రంగాల్లో పట్టణాభివృద్ధి
కైలాస్‌నగర్: పట్టణాన్ని భవిష్యత్తు అవసరా లకు అనుగుణంగా అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. పట్టణంలోని ఆర్‌ఆర్ నగర్‌లో రూ.1.50 కో ట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, వరద కాలువలు, కల్వర్టుల నిర్మాణాలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూషతో కలిసి శనివారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వార్డుల్లో మౌలి క వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


