కుభీర్: మండలంలోని రాజురా శివారు పత్తిచేనులో అస్వస్థతతో జింక మృతిచెందినట్లు ఎఫ్‌బీవో రాజేశ్ తెలిపారు. శనివారం జింక పడి ఉండటాన్ని చూసిన రాజురావాసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు కుభీర్ పశువైధ్యాధికారి గణేశ్‌ను పిలిపించి చికిత్స చేయించారు. అనంతరం భైంసా పశువైద్యశాలకు తరలించగా అక్కడే మృతి చెందింది. రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న కుభీర్ పశువైద్యశాలకు కాకుండా 16కిలోమీటర్ల దూరంలో ఉన్న భైంసాకు జింకను తీసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎఫ్బీవోను ప్రశ్నించగా కుభీర్ పశువైద్యశాలలో సరైన మందులు లేవని భైంసాకు తరలించినట్లు పేర్కొన్నారు. కుభీర్ వైద్యులు గణేశ్‌తో జింక పోస్టుమార్టం జరిపించినట్లు తెలిపారు.


