త్వరలో టీజీ సేఫ్‌ ఠాణా | TG Safe Commissioner Avinash Mohanty Interview with Sakshi | Sakshi
Sakshi News home page

త్వరలో టీజీ సేఫ్‌ ఠాణా

Oct 9 2026 5:34 AM | Updated on Oct 9 2026 5:35 AM

TG Safe Commissioner Avinash Mohanty Interview with Sakshi

కల్తీ కేసుల దర్యాప్తునకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ 

డీఎస్పీ నేతృత్వంలో 80 మంది సిబ్బందితో... 

‘సాక్షి’తో టీజీ సేఫ్‌ కమిషనర్‌ అవినాష్‌ మహంతి

సాక్షి, హైదరాబాద్‌: కల్తీ సంబంధిత కేసుల దర్యాప్తు కోసం త్వరలోనే తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ సేఫ్‌) పరిధిలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు కానుందని ఆ విభాగం కమిషనర్‌ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. డీఎస్సీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ ఠాణాలో 80 మంది వరకు సిబ్బంది ఉంటారని తెలిపారు.

ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వివరించారు. కల్తీ ఆహారం, గడువు మీరిన పదార్థాల వినియోగం, అపరిశుభ్రతను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. క్యూర్‌ ఏరియాను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని, దీంతోపాటే రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్, డ్రగ్స్‌ వింగ్స్‌ తనిఖీలు చేపడతాయని స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  

ఆలోచన అక్కడ మొదలైంది  
ప్రజారోగ్యంతో సంబంధమున్న ఆహారం, డ్రగ్స్‌ విషయంలో పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచనతోనే టీజీ సేఫ్‌ ఏర్పాటైంది. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ సేఫ్టీ (ఎఫ్‌డీ) విభాగం ఇప్పటికే 14 రాష్ట్రాల్లో అమలులో ఉంది. తెలంగాణలో ఈ రెండు విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం నిపుణుల కమిటీలు బెంగళూరు, ముంబై నగరాల్లో పర్యటించాయి.

అక్కడ అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేశాయి. ఆ అంశాల్లో మనకు అనువైనవి ఎంపిక చేసుకొని, మరింత పటిష్టంగా టీజీ సేఫ్‌ను తీర్చిదిద్దారు. ఈ విభాగాన్ని డ్రగ్, ఫుడ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ల్యాబ్, ప్రాసిక్యూషన్, అడ్మిన్‌ వింగ్స్‌గా విభజించాం. మా పరిధిలో తనిఖీలు చేపట్టడం, నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించడంతోపాటు కోర్టు కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.  

తొలి ప్రాధాన్యం క్యూర్‌ ఏరియా 
రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలు సుమారు 1.70 లక్షల వరకు రిజిస్టర్‌ అయ్యాయి. అందులో అత్యధిక శాతం ఉన్న క్యూర్‌ ఏరియాపైనే మా ప్రధాన ఫోకస్‌. గడిచిన నెలన్నర రోజులుగా తనిఖీలు చేపడుతున్నాం. హోటళ్లలో పరిస్థితులను బట్టి తక్షణం మూడు రకాల నోటీసులు జారీ చేస్తున్నాం. సివియర్‌ వైలేషన్స్‌ ఉంటే వెంటనే లైసెన్స్‌ రద్దు, కొంత వరకు మెరుగ్గా ఉంటే షోకాజ్‌ నోటీసులు, చిన్నపాటి లోటుపాట్లు ఉంటే ఇంప్రుమెంట్‌ నోటీసులు. లైసెన్స్‌ రద్దు చేస్తే 14 రోజుల్లోగా రీ వెరిఫికేషన్‌కు సమయం ఇస్తున్నాం. అప్పటికి అక్కడ పరిస్థితులు మెరుగుపడితే లైసెన్స్‌ పునరుద్ధరిస్తున్నాం.  

నెలన్నరలో 64 లైసెన్సుల రద్దు
నెలన్నర రోజుల్లో ర్యాండమ్‌గా 299 హోటళ్లు, రెస్టారెంట్లు, కెఫీ, పీజీ హాస్టళ్లు, డెయిరీ యూనిట్లు, స్వీట్స్, ఇన్‌స్టా కార్ట్, స్విగ్గీ, జెప్టో, బిగ్‌బాస్కెక్ట్‌ వంటి డార్క్‌సోర్ట్స్‌పై తనిఖీలు నిర్వహించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించే 64 సంస్థల లైసెన్సులను రద్దు చేశాం. 56 సంస్థలకు షోకాజ్, 112 సంస్థలకు ఇంప్రుమెంట్‌ నోటీసులు ఇచ్చాం. నిరీ్ణత సమయంలోగా మరో మారు మా అధికారుల బృందాలు తనిఖీలు చేస్తాయి. 299 సంస్థల నుంచి 277 శాంపిల్స్‌ సేకరించాం. ల్యాబ్‌లో పరీక్షించి, అన్‌ సేఫ్‌ అని వస్తే కోర్టులో కేసు వేస్తాం. జరిమానాలు విధిస్తాం. ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నందున అనలాగ్‌ పన్నీర్‌ తయారీ, విక్రయాలను ఏడాది పాటు బ్యాన్‌ చేశాం. ఫుడ్, డ్రగ్స్‌ వింగ్‌ అధికారులు జిల్లాల్లోనూ  విస్తృతంగా తనిఖీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, మెదక్‌ తదితర జిల్లాల్లో మా బృందాలు సోదాలు చేపట్టాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement