సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల రిషిత పెన్మెత్స జాతీయ స్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. జైపూర్‌లోని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 31 మంది యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తెలుగు అమ్మాయిగా జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించడం విశేషం.
రిషిత హైదరాబాద్‌లోని ఒబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతోంది. త్వరలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో రిషిత భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. దీంతో హైదరాబాద్‌కు చెందిన ఈ యువతికి మరింత గుర్తింపు లభించనుంది.
ఇదీ చదవండి: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి నాన్ బెయిలబుల్ వారెంట్


