Mrs. Universe 2026: శ్రీలకంలోని కొలంబోలో జరిగిన 49వ మిసెస్ యూనివర్స్ 2026 పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియా ముంజాల్ 'ఫస్ట్ రన్నరప్' స్థానాన్ని దక్కించుకున్నారు. ఇద్దరు పిల్ల తల్లి ముంజాల్ ఇంటి బాధ్యతలు చక్కబెట్టుకుంటూనే అంతర్జాతీయ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
మిసెస్ ఇండియా 2025 పోటీలో పాల్గొనడం ద్వారా ఆమె మిసెస్ యూనివర్స్ పోటీల్లోకి ప్రవేశించే ఛాన్స్ దక్కించుకున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.
ఆమె ప్రస్థానం ఎలా సాగిందంటే..
కొలంబోలో ముంజాల్ సాధించిన విజయం ఆమె ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన వ్యక్తిగత ఆశయాలను కూడా సాధించాలని నిర్ణయించుకుందామె. నిజానికి ఆమె విజయం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మహిళలు తమ దైనందిన బాధ్యతలు నిర్వర్తిస్తూనే కొత్త అవకాశాలు అన్వేషించవచ్చని, కొత్త ఆసక్తులను పెంపొందించుకోవచ్చని నిరూపించింది.
బరువు తగ్గలే ఫిట్‌నెస్ జర్నీ..
నిజాని ముంజాల్ గతంలో 104 కిలోల బరువు ఉండేది. నిరంతర కృషితో ఏకంగా 44 కిలోలు తగ్గి 60 కిలోలకు చేరుకుంది. ఈ శారీరక మార్పు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యేలా చేసింది. ఆమె ఫిట్‌నెస్ జర్నీలో ప్రోటీన్ కీలకపాత్ర పోషించింది.
మిసెస్ ఇండియా 2025 తర్వాత మరో మైలురాయి మిసెస్ యూనివర్స్ 2026లో ఫస్ట్ రన్నరప్‌గా నిలవడం ముంజాల్ సాధించిన మరో గొప్ప విజయం. అంతేగాదు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి కుటంబాధ్యతలు పెద్ద ఆటంకం కాదని నిరూపించి ముంజల్ సక్సెస్.
ఇదీ చదవండి: అమ్మ చేస్తే అభినందించరు.. కానీ నాన్న చేస్తే..! : పిల్లల పెంపకంపై ఉసాసన కొణిదెల షాకింగ్ వ్యాఖ్యలు


