నోరూరించే మూడు వంటకాలు.. తయారీ కూడా చాలా ఈజీ! | Easy Indian Recipes Misal Pav Bharta | Sakshi
Sakshi News home page

నోరూరించే మూడు వంటకాలు.. తయారీ కూడా చాలా ఈజీ!

Nov 15 2026 2:03 PM | Updated on Nov 15 2026 2:45 PM

Easy Indian Recipes Misal Pav Bharta

ఫండే

స్నాక్‌ సెంటర్‌

రోజూ చేసే వంటకాలేనా? కాస్త కొత్తగా, వెరైటీగా ఏదైనా రుచి చూడాలనుకుంటున్నారా? అయితే మహారాష్ట్ర స్పెషల్‌ మిసల్‌ పావ్‌ నుంచి ఘుమఘుమలాడే వంకాయ భర్తా వరకు.. నోరూరించే ఈ మూడు వంటకాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. కారం, మసాలా రుచులతో పాటు చివర్లో జిలేబీ వైట్‌ చాక్లెట్‌ బార్క్‌తో స్వీట్‌ ట్రీట్‌ కూడా ఆస్వాదించవచ్చు!

మిసల్‌ పావ్‌..

కావాల్సినవి..
మొలకెత్తిన పెసలు: ఒక కప్పు,
ఉల్లిపాయలు: రెండు,
టొమాటోలు: రెండు,
అల్లం వెల్లుల్లి ముద్ద: ఒక చెంచా,
కారం: ఒక చెంచా,
ధనియాల పొడి: ఒక చెంచా,
గరం మసాలా: అర చెంచా,
పసుపు: కొద్దిగా,
జీలకర్ర: అర చెంచా,
నూనె, ఉప్పు: తగినంత,
గార్నిష్‌ కోసం: సన్నని సేవ్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, పావ్‌ బన్స్‌.

తయారీ..

  • ముందుగా బాణలిలో నూనె వేసి జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.

  • అల్లం వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు మగ్గించాలి.

  • ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.

  • మొలకెత్తిన పెసలు వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి మెత్తబడే వరకు ఉడికించాలి.

  • కూర దగ్గరపడ్డాక దించేయాలి. పైన సన్నని సేవ్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర చల్లాలి. కొద్దిగా నిమ్మరసం పిండాలి.

  • పావ్‌ బన్స్‌ను పెనంపై కొద్దిగా వెన్న వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

  • వేడివేడి మిసల్‌ కూరతో కలిపి అందించాలి. అంతే, మహారాష్ట్ర రుచుల మిసల్‌ పావ్‌ సిద్ధం!

వంకాయ భర్తా..

కావాల్సినవి..
పెద్ద వంకాయ: ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు: 8,
ఉల్లిపాయ ముక్కలు: కప్పు,
టొమాటో ముక్కలు: కప్పు,
పచ్చిమిర్చి: 2,
అల్లం తురుము: 2 టీస్పూన్లు,
పచ్చి బఠాణీలు: పావు కప్పు,
ఆవ నూనె: 4 టేబుల్‌ స్పూన్లు,
జీలకర్ర: టీస్పూన్,
ధనియాల పొడి: 2 టీస్పూన్లు,
పసుపు: టీస్పూన్,
కారం: టీస్పూన్,
గరం మసాలా: అర టీస్పూన్,
ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా.

తయారీ విధానం..

  • ముందుగా వంకాయకు అక్కడక్కడ చిన్న గాట్లు పెట్టి వెల్లుల్లి రెబ్బలను వాటిలో ఉంచాలి.

  • కొద్దిగా నూనె రాసి చిన్న మంటపై అన్ని వైపులా బాగా కాల్చాలి.

  • చల్లారిన తర్వాత పై తొక్క తీసి లోపలి గుజ్జును మెత్తగా చేసుకోవాలి.

  • బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి వేయించాలి.

  • ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చాక టొమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.

  • ఇప్పుడు ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.

  • తర్వాత బఠాణీలు, వంకాయ గుజ్జు వేసి బాగా కలిపి కొత్తిమీర చల్లాలి. అంతే, వేడి వేడి వంకాయ భర్తా సిద్ధం.

జిలేబీ వైట్‌ చాక్లెట్‌  బార్క్‌..

కావాల్సినవి..
వైట్‌ చాక్లెట్‌: 200 గ్రాములు,
జిలేబీలు: 50 గ్రాములు,
ఎండిన గులాబీ రేకులు: ఒక టీస్పూన్,
పిస్తా పలుకులు: ఒక టేబుల్‌ స్పూన్‌.

తయారీ..

  • ముందుగా వైట్‌ చాక్లెట్‌ను చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

  • ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, దానిపై మరో గాజు గిన్నె ఉంచాలి.

  • అందులో చాక్లెట్‌ ముక్కలు వేసి కరిగించాలి.

  • చాక్లెట్‌ పూర్తిగా కరిగి మెత్తగా అయ్యాక బటర్‌ పేపర్‌పై పోసి, అర అంగుళం మందంలో సమానంగా పరచాలి.

  • దానిపై చిన్న ముక్కలుగా చేసిన జిలేబీలను అమర్చాలి.

  • తర్వాత ఎండిన గులాబీ రేకులు, పిస్తా పలుకులు చల్లాలి.

  • దీన్ని ఫ్రిజ్‌లో సుమారు 20 నిమిషాలు ఉంచాలి.

  • చాక్లెట్‌ గట్టిపడ్డాక బయటకు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అంతే, రుచికరమైన జిలేబీ వైట్‌ చాక్లెట్‌ బార్క్‌ సిద్ధం.

ఇదీ చదవండి: కారులో ఈ 3 గాడ్జెట్లు ఉంటే.. టెన్షనే ఉండదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement