breaking news
Indian Recipes
-
రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్!
వేడివేడి బీటెన్ కాఫీ నుంచి ఘుమఘుమలాడే కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ వరకు.. చివర్లో నోట్లో కరిగే ధార్వాడ్ పేడాతో ఈరోజు మీ రుచుల పండుగను పూర్తి చేసుకోండి. సులభమైన తయారీ విధానంతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మూడు వంటకాలు రుచితోపాటు ప్రత్యేకతను కూడా అందిస్తాయి. మరి ఈ వంటకాల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..బీటెన్ కాఫీ..కావలసినవి:ఇన్ స్టంట్ కాఫీ పొడి: 2 టేబుల్ స్పూన్లు,పంచదార: 2 టేబుల్ స్పూన్లు,వేడి నీళ్లు: 2 టేబుల్ స్పూన్లు,పాలు: 2 కప్పులు (చిక్కటివి),గార్నిష్ కోసం: కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి.తయారీ:ఒక కప్పులో లేదా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, 2 టేబుల్ స్పూన్ల పంచదార, రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోయాలి.మొదట్లో ఇది చిక్కటి నల్లని ద్రవంలా కనిపిస్తుంది.ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ లేదా విస్కర్‌తో వేగంగా తిప్పుతూ చిలకాలి.తిప్పుతున్న కొద్దీ కాఫీ రంగు నలుపు నుంచి క్రమంగా లేత గోధుమ వర్ణంలోకి మారి, చిక్కటి నురగలాగా తయారవుతుంది.ఒక పాత్రలో రెండు కప్పుల పాలను బాగా మరిగించాలి.పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.ఇపుడు మనం తయారుచేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్‌ను రెండు సర్వింగ్ కప్పులలో సమానంగా వేయాలి.దానిపై వేడివేడి పాలను కొద్దిగా పైనుంచి ధారగా పోయాలి.ఇలా పోయడం వల్ల కాఫీ క్రీమ్ పైన తేలుతూ మంచి నురగలా వస్తుంది.స్పూన్ తో మెల్లగా ఒకసారి కలిపి, పైన కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి జల్లి వేడివేడిగా సర్వ్ చేయడమే! కాఫీ చిలికేటప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే, చుక్కల చొప్పున వేడి నీళ్లను మాత్రమే చేర్చుకోవాలి.కాశ్మీరీ మటన్ రోగన్ జోష్కావలసినవి:మటన్: 1/2 కేజీ,నెయ్యి : 4–5 టేబుల్ స్పూన్లు,పెరుగు: 1/2 కప్పు,ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి),అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్,కశ్మీరీ మిర్చి పౌడర్: 2 టేబుల్ స్పూన్లు,సోంపు పౌడర్: టేబుల్ స్పూన్,సొంటి పొడి: అర టీస్పూన్,హోల్ గరం మసాలాలు: ఏలకులు (4), లవంగాలు (4), దాల్చిన చెక్క (2 ముక్కలు), బిర్యానీ ఆకు (2), గరం మసాలా పొడి 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి, అందులో చిలికిన పెరుగు, కొద్దిగా కశ్మీరీ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగించాలి.అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి.ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ను వేసి మీడియం ఫ్లేమ్‌పై 8–10 నిమిషాలు బాగా వేయించాలి.మటన్ నుంచి నీరు బయటకు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి.అందులో సోంపు పొడి, సొంటి పొడి, మిగిలిన కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి.తగినంత నీరు పోసి మూత పెట్టి మటన్ మెత్తగా ఉడికించుకోవాలి.చివరగా పైన గరం మసాలా చల్లుకొని, నెయ్యి పైకి తేలే వరకు సన్నని మంటపై 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే! ఘుమఘుమలాడే వేడివేడి కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ సిద్ధమైనట్లే! దీనిని వేడివేడి అన్నం, నాన్ లేదా పరాటాతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.ధార్వాడ్ పేడాకావలసినవి:చిక్కటి పాలు: ఒకటిన్నర లీటరు (తాజా పనీర్ కోసం),నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు,చక్కెర: ముప్పావు కప్పు (తీపికోసం), మరో 2 టేబుల్ స్పూన్లు క్యారమెల్ కోసం,నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు,పాలు: పావు కప్పు,ఏలకుల పొడి: అర టీస్పూన్,చక్కెర పొడి: 3 టేబుల్ స్పూన్లు.తయారీ:ముందుగా పాలను మరిగించి, అందులో కొద్దికొద్దిగా నిమ్మరసం వేస్తూ కలపాలి.పాలు విరిగి నీరు వేరయ్యాక, కాటన్ క్లాత్‌లో వడకట్టి, తిరిగి చల్లని నీటితో కడిగి నీళ్లన్నీ పిండేయాలి.వడకట్టిన పనీర్‌ను ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి కలుపుతూ ఎక్కడా గడ్డలు లేకుండా మెత్తటి ముద్దలా చేసుకోవాలి.ఆ తరువాత ఒక బాణలిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పనీర్ తురుమును వేయాలి.సన్నని మంటపై కలుపుతూ వేయించాలి.పనీర్ పొడిగా మారుతున్నప్పుడు మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి, పాలు చల్లుతూ వేయించాలి.పనీర్ గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.ఆ తరువాత మరొక చిన్న పాత్రలో 2 స్పూన్ల చక్కెర వేసి సన్నని మంటపై నీళ్లు పోయకుండా కరగనివ్వాలి.చక్కెర బ్రౌన్ కలర్ క్యారమెల్గా మారిన వెంటనే వేయించిన పనీర్‌లో పోయాలి.అలాగే చక్కెర, ఏలకుల పొడి, 2 స్పూన్ల పాలు వేసి చక్కెర కరిగే వరకు కలపాలి.మిశ్రమం దగ్గరపడి డార్క్ రంగులోకి వస్తుంది. ఇపుడు దీనిని కొద్దిగా చల్లారనిచ్చి, మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పల్స్ చేసి తీస్తే మెత్తగా తయారవుతుంది.చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా తీసుకుంటూ కోలగా తయారుచేసుకోవాలి.తర్వాత చక్కెర పొడిలో దొర్లించి కోటింగ్ ఇవ్వాలి. అంతే ధార్వాడ్ పేడా రెడీ! వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే వారం రోజులకు పైగా తాజాగా ఉంటుంది. -
వంటింట్లోనే రెస్టారెంట్ రుచి.. ఈ రెసిపీలు ట్రై చేయండి!
రోజూ ఒకే రకమైన వంటకాలతో బోర్ కొడుతుందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే రుచికరమైన వంటకాలను ట్రై చేయండి. పనసకాయ దమ్ బిర్యానీ, ఆకాకరకాయ వేపుడు, సబుదానా వడ.. మూడు వంటకాలూ రుచితో పాటు మీ భోజనానికి మంచి వెరైటీని తీసుకొస్తాయి.సబుదానా వడకావలసినవి:సగ్గుబియ్యం: కప్పు,బంగాళాదుంపలు: 2 పెద్దవి (ఉడికించి మెత్తగా చిదుముకోవాలి),వేయించిన పల్లీల పొడి: 1/2 కప్పు,పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి),అల్లం తరుగు: టీస్పూన్,జీలకర్ర: టీస్పూన్,నిమ్మరసం: టీస్పూన్,కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: వేయించడానికి సరిపడా.తయారీ:ముందుగా సగ్గుబియ్యాన్ని 2–3 సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.తర్వాత అదనంగా ఉన్న నీటిని వంపేయాలి.తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో బాగా నానిన సగ్గుబియ్యం, ఉడికించి, చిదుముకున్న బంగాళాదుంపలు, పల్లీల పొడి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.చేతులకు కొద్దిగా నూనె లేదా నీళ్లు రాసుకుని, మిశ్రమాన్ని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసి, అరచేతిలో పెట్టి వడలాగా ఒత్తుకోవాలి.మందం ఎక్కువగా లేకుండా, పగుళ్లు రాకుండా చూసుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేడి చేసి.. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వడలను ఒక్కొక్కటిగా వేయాలి.ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి, తర్వాత రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి సబుదానా వడ రెడీ!పనసకాయ దమ్ బిర్యానీకావలసినవి:పచ్చి పనసకాయ ముక్కలు: 250 గ్రాములు,బాస్మతీ బియ్యం: రెండు కప్పులు (నానబెట్టినవి),పెరుగు: 1/2 కప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీ స్పూన్,కారం: సరిపడా,పసుపు: 1/2 టీ స్పూన్,బిర్యానీ మసాలా: ఒకటిన్నర టీ స్పూన్,ధనియాల పొడి: టీ స్పూన్,ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి ఫ్రై చేసినవి),పచ్చిమిర్చి: 4 (నిలువుగా చీల్చినవి),పుదీనా, కొత్తిమీర: గుప్పెడు,హోల్ బిర్యానీ దినుసులు, నెయ్యి, నూనె: సరిపడా,నిమ్మరసం: టేబుల్ స్పూన్,ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ఇందుకోసం కుక్కర్లో పనసకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు, పసుపు, పావు టీస్పూన్ ఉప్పు వేసి మీడియం మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి నీళ్లు వడకట్టండి.తరువాత ఈ పనస ముక్కలలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, సగం ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, సరిపడా ఉప్పు, స్పూన్ నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయండి.మరొక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి, అందులో షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, స్పూన్ నూనె వేయండి.నీళ్లు మరిగాక నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి 70 శాతం వరకు ఉడికించి నీళ్లను వడకట్టండి.అనంతరం బిర్యానీ పాత్రలో 2 స్పూన్ల నూనె, స్పూన్ నెయ్యి వేసి మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలను వేసి సన్నని మంటపై 5 నిమిషాలు మగ్గనివ్వండి.దీనిపైన ఉడికించిన బాస్మతీ బియ్యాన్ని లేయర్‌గా పరవండి. దానిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేయండి.మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా 5 నిమిషాలు మీడియం మంటపై, ఆ తర్వాత 10–12 నిమిషాలు సన్నని మంటపై దమ్ చేయండి. అంతే çఘుమఘుమలాడే పనసకాయ దమ్ బిర్యానీ రెడీ!ఆకాకరకాయ వేపుడుకావలసినవి:ఆకాకరకాయలు: 250 గ్రాములు (సన్నగా కట్ చేసిన ముక్కలు),ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది),పసుపు: 1/2 టీస్పూన్,కారం: రుచికి తగినట్లు,ధనియాల పొడి: టీస్పూన్,వెల్లుల్లి రెబ్బలు: 6 (కచ్చాపచ్చాగా దంచినవి),ఉప్పు: రుచికి సరిపడా,నూనె: 3 టేబుల్ స్పూన్లు,తాళింపు గింజలు: టీస్పూన్,ఎండుమిర్చి: 2,కరివేపాకు: ఒక చిన్న రెమ్మ.తయారీ:ఆకాకరకాయలను శుభ్రంగా కడిగి, సన్నని చక్రాల్లా లేదా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి.తరువాత ఒక మూకుడులో నూనె వేడి చేసి కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై దోరగా వేయించండి.ముక్కలు సగం వేగాక, వాటిని బాణలికి ఒకవైపు జరిపి, మిగిలిన నూనెలో తాళింపు గింజలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించండి.తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.ఇప్పుడు ఉల్లిపాయలు, ఆకాకరకాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి.చివరగా కారం, ధనియాల పొడి వేసి.. ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి దించేయండి.వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ ఫ్రైౖ తింటే చాలా రుచిగా ఉంటుంది. -
డచ్ కార్యాలయంలో భారతీయ వంటకాలు..వీడియో వైరల్!
భారతదేశ సంస్కృతిలానే ఇక్కడ ఆహారం కూడా సంప్రదాయనుగుణంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పుణ్యమా అని భారతీయ వంటకాల గురించి ఖండాంతరాలకు వ్యాప్తి అవుతోంది. విలక్షణమైన స్వీట్స్, మసాలాతో కూడిన వంటకాలు చూసి విదేశీయలు సైతం టేస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. పైగా వాళ్లు కూడా ఈ వంటకాలను చేసేందుకు రెడీ అవుతున్నారు కూడా. ఇప్పడు ఇదంత ఎందుకంటే..మన భారతీయ వంటకాలను ఓ డచ్ కంపెనీ తన ఉద్యోగులకు సర్వ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెదర్లాండ్‌లో అనువింద్ కన్వాల్ అనే భారతీయుడు తన ఆఫీస్‌లో ఉద్యోగులుకు భారతీయ ఆహరం పేరుతో మన సంప్రదాయ వంటకాలు సర్వ్ చేసిన వీడియోని పంచుకున్నారు. ఇది ]ప్రశ్నించగదిగినది' అనే క్యాప్షన్ జోడించి మరీ ఈ వీడియోని పోస్ట్ చేశారు. అంతేగాదు కన్వాల్ పోస్ట్‌లో తన కార్యాలయంలో భారతీయ ఆహారం అనేది కొంచెం సందేహాస్పదంగా ఉన్నప్పటికీ.. ఎలా ఈ వంటకాలను వండారు అనేదాని గురించి తాను తెలుసుకోవాలనుకోవడం లేదని అన్నారు. అలాగే తన కార్యాలయంలో బెల్ పెప్పర్ పడిమా చట్నీ, నాన్స్ తదితర భారతీయ వంటకాలను సర్వ్ చేసినట్లు కూడా తెలిపారు. ఈ వీడియోకి ఒక మిలియన్‌కి పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు మాత్రం ఇలా వైవిధ్యంగా ఉండేందుకు ప్రయత్రిస్తున్న సదరు కంపెనీని ప్రశంసించగా, మరికొందరూ భారతీయ వంటకాలు ఖండాంతారాలకు చేరుకోవడం విశేషమే కాకుండా టేస్టే చేయాలనే వారి ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Anuvind Kanwal (@anuvindkanwal) (చదవండి: టేస్ట్ అట్లాస్ మెచ్చిన డెజర్ట్‌తో గుండె ఆరోగ్యం పదిలం..!) -
షీఖ్ కబాబ్..గులాబ్ జామున్
భారత వంటకాలను ఆస్వాదించిన ఫెడరర్ న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ భారత్‌లో అడుగు పెట్టిన దగ్గరినుంచి అతని ఆట మొదలు అన్నీ విశేషాలే! తొలిసారి తన ఆటతో మన అభిమానులను అలరించిన ఈ స్టార్... భారత్ టూర్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. భారత్‌లో ఆహారం రుచి చూడాలని ఉందంటూ గతంలోనే ప్రకటించిన రోజర్, ఇప్పుడు వాటిని ఆస్వాదించాడు. ఐపీటీఎల్ ఆడేందుకు ఢిల్లీలో ఉన్న ఫెడరర్, తన తండ్రి, టీమ్‌తో కలిసి హోటల్ మౌర్యలో భోజనం చేశాడు. అనేక రకాల శాకాహార, మాంసాహాల వెరైటీలు తన డిన్నర్లో ఉండేలా చూసుకున్నాడు. భారీ సైజు నాన్ కీ రోటీని అమిత ఇష్టంగా తిన్నాడు. దీంతో పాటు సికందరీ రాన్, ముర్గ్ మలై కబాబ్, షీఖ్ కబాబ్, తందూరి గోబి, తందూరీ ఆలూ, దాల్ బుఖ్రాలను తీసుకున్నాడు. ఇక భోజనం చివర్లో వేర్వేరు రకాల మిఠాయిలు రుచి చూశాడు. కుల్ఫీ, ఫిర్ని, గులాబ్ జామున్ ఇందులో ఉన్నాయి. మొత్తానికి ఈ స్విస్ స్టార్‌కు మన భోజనం భలే నచ్చింది! దీపికతో ఆటా పాటా... ఐపీటీఎల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఫెడరర్, బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోన్, ఆమిర్‌ఖాన్‌లతో సరదాగా కొద్ది సేపు టెన్నిస్ ఆడాడు. ఐపీటీఎల్ డిన్నర్లో భాగంగా దీపిక, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌లతో కలిసి డ్యాన్స్ కూడా చేయడం విశేషం.


