24 డోనట్లు..ఒక ఈమెయిల్‌:సాక్షాత్తు సీఈవోనే ఫిదా! | Indian-origin founder praises young programmers cold email | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల కుర్రాడి ఈమెయిల్‌కి భారత సంతతి సీఈవో ఫిదా..!

Nov 15 2026 12:51 PM | Updated on Nov 15 2026 12:53 PM

Indian-origin founder praises young programmers cold email

కొత్త ఉద్యోగం కోసం లేదా ఇంటర్న్‌షిప​ కోసం ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లకు వ్యక్తిగతంగా మెయిల్స్‌ పంపిస్తాం. అయితే అందులో కొన్ని మనసుని తాకేలా ఫిదా చేస్తాయి. నిజానిక ఓ నిరుద్యోగి లేదా స్టూడెంట్‌కి అదే తొలి ఇంప్రెషన్‌గా పేర్కొనచ్చు. ఆ ఇంప్రెషన్‌నే కొట్టేశాడు ఈ 20 ఏళ్ల యువకుడు. అతడి మెయిల్‌కి ఫిదా అయిపోయాడు సాక్షాత్తు ఆ కంపెనీ సీఈవో. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

అసలేం జరిగిందంటే..శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఏఐ స్టార్టప్ టర్న్‌స్టోన్ సహ-వ్యవస్థాపకుడు జై భాటియా తన సోషల్‌ మీడియా ఎక్స్‌ పోస్ట్‌లో ఒక స్క్రీన్‌ షాట్‌ని పంచుకుంటూ..పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తనకు ఇప్పటివరకు వచ్చిన ఈ మెయిల్స్‌లో ఇదే అత్యంత అద్భుతమైనదని రాశారు. అది ఒక 20 ఏళ్ల యువకుడు లోగాన్‌ హగ్‌న నుంచి వచ్చి ఈమెయిల్‌గా పేర్కొన్నారు. 

అతడు తన దృష్టిని ఆకర్షించేందుకు 24 డోనట్లు, చేతితో రాసిన లేఖను తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఆఫీసుకి వచ్చానని..కార్యాలయం కనుగొనడంలో విఫలమయ్యానని మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిపాడు. దాంతో లండన్‌కి వెళ్లే తిరు ప్రయాణంలో అసలు ఇదంతా ఈమెయిల్‌ చేయాలని నిర్ణయించుకుని ఇలా మెయిల్‌ చేసినట్లు వివరించాడని చెప్పాడు. ఆ లేఖలో ఏముందంటే..హగ్‌భాటియా వ్యాపార ప్రస్థానం పట్ల ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ వ్యవస్థాపకుడి విజయాలు తననెలా ప్రేరేపించాయో వివరించాడు.

భాటియా వంటి పారిశ్రామికవేత్తల విజయం తన సొంత డ్రీమ్స్‌ని కొనసాగించేలా పురికొల్పిందని చెబుతూ..ఆ జిజ్ఞాసే తనను వై కాంబినేటర్‌ ప్రోగ్రామ్‌లో చేరడం కోసం పాఠశాల విధ్యను సైతం మధ్యలో వదిలేసే స్థైర్యానికి కారణమైందని వెల్లడించాడు. అలాగే భాటియాను భోజనానికి లేదా విందుకు కలవాలని కోరుతూ..తన బృందం అభివృద్ధి చేసి ఒక ఉత్పత్తిని కూడా ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చాడు. 

తాము డెవలప్‌ చేసిన ప్రొడక్ట్‌ ఏఐ టోకెన్‌ ఖర్చులను, డీబగ్గింగ్‌ కోసం వెచ్చించే సమయాన్ని ఆదాచేస్తుందని తెలుపుతూ..కావలంటే ఒక వారంపాటు తమ ప్రొడక్ట్‌ని ఫ్రీగా పరీక్షించుకోవచ్చని ఆఫర్‌ కూడా ఇచ్చాడు. ఇది భాటియాను ఎంతగానే ఆకర్షించడమే కాదు..ఇప్పటి వరకు వచ్చిన మెయిల్స్‌లో ఇదే అత్యంత కూలెస్ట్‌ మెయిల్‌గా అభివర్ణించాడు. 

కాగా, భాటియా వై కాంబినేటర్ మద్దతు ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత ఏఐ స్టార్టప్ అయిన టర్న్‌స్టోన్‌కు సహ వ్యవస్థాపకుడు. నెటిజన్లు కూడా ఆ యువకుడి హగ్‌ క్రియేటివిటీని మెచ్చుకోగా కొందరు అది ఐఏ ఆధారిత లేఖగా అనుమానిస్తూ పోస్టులు పెట్టారు. 

ఇదీ చదవండి: టాప్‌ 50లో భారతీయ రెస్టారెంట్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement