మన దేశంలో పుట్టలేదు.. కానీ బొప్పాయి ఉత్పాదనలో భారత్‌ టాప్‌! | Papaya Nutrition Facts, India Production | Sakshi
Sakshi News home page

మన దేశంలో పుట్టలేదు.. కానీ బొప్పాయి ఉత్పాదనలో భారత్‌ టాప్‌!

Nov 15 2026 1:16 PM | Updated on Nov 15 2026 1:20 PM

Papaya Nutrition Facts, India Production

ఫండే

ఘనాంకాలు

పోర్చుగీసులు పదహారో శతాబ్ది ప్రాంతంలో దక్షిణ అమెరికా నుంచి మన దేశానికి తీసుకొచ్చిన రకరకాల పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. పదహారో శతాబ్దికి పూర్వం బొప్పాయి అంటే ఏమిటో ఎరుగని మన దేశం ఇప్పుడు బొప్పాయి ఉత్పాదనలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

పోర్చుగీసులు మన దేశానికి తీసుకొచ్చిన అనతికాలంలోనే బొప్పాయికి దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది.

నాటి ఆయుర్వేద నిపుణులు దీని ఔషధ గుణాలను కూడా గుర్తించి, గ్రంథస్థం చేశారు. బొప్పాయి ఆకులు, బొప్పాయి పండ్ల ఆకారం చూసి, దీనికి ‘ఏరండ కర్కటి’ అని సంస్కృత నామకరణం కూడా చేశారు. పోషకాలలో గొప్పదైన బొప్పాయి విశేషాలను గణాంకాల్లో చూద్దాం...

బొప్పాయి ఉత్పాదనలో భారత్‌ అగ్రస్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం మొదటి పది స్థానల్లో లేదు. భారత్‌లో పండే బొప్పాయి ఎక్కువగా స్థానికంగానే వినియోగమవుతోంది. భారత్‌ నుంచి మొత్తం బొప్పాయి ఉత్పాదనలో దాదాపు ఒక్క శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది.

ఇదీ చదవండి: పాత జీన్స్‌తోనే కొత్త స్టైల్‌.. ఈ ట్రిక్స్‌ ట్రై చేయండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement