షెడ్యూల్‌ కంటే ముందుగానే న్యూజిలాండ్‌లో వాలిపోయిన గిల్ | Shubman Gill Arrives Early In New Zealand, Begins Preparations For Test Series | Sakshi
Sakshi News home page

షెడ్యూల్‌ కంటే ముందుగానే న్యూజిలాండ్‌లో వాలిపోయిన గిల్

Oct 26 2026 8:03 PM | Updated on Oct 26 2026 8:11 PM

Shubman Gill Arrives Early In New Zealand, Begins Preparations For Test Series

source: X

టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ షెడ్యూల్‌ కంటే ముందుగానే న్యూజిలాండ్‌లో అడుగుపెట్టాడు. వచ్చీరాగానే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. న్యూజిలాండ్‌ గడ్డపై రెడ్ బాల్‌తో గిల్‌ సాధన చేస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గిల్‌ సాధన టెస్ట్‌ సిరీస్‌ కోసం అతడి సన్నద్దతను స్పష్టం చేస్తుంది.

టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గిల్‌ తొలి మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు. ఆ తర్వాత జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు చివరి రెండు వన్డేలకు దూరంగా ఉండనున్నాడు.

2025లో భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్‌కు న్యూజిలాండ్ గడ్డపై టెస్టులు ఆడటం ఇదే తొలిసారి కానుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటం అతడికి సవాలుగా మారనుంది.

న్యూజిలాండ్‌లో భారత్ చివరిసారిగా 2009లో టెస్టు సిరీస్ గెలిచింది. ఈ నేపథ్యంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్న రెండు టెస్టుల సిరీస్ గిల్‌కు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కీలకం కానుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఉత్కంఠ విజయాలు సాధించింది. మూడో టీ20 రేపు వెల్లింగ్టన్‌ వేదికగా జరుగనుంది. 

ఇదీ చదవండి: టీమిండియాకు శుభవార్త.. ఆ ఇద్దరు వచ్చేస్తున్నారు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement