చరిత్ర సృష్టించిన మంధన | Smriti becomes the leading run getter in Women's T20I history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మంధన

Sep 20 2026 11:22 AM | Updated on Sep 20 2026 11:22 AM

Smriti becomes the leading run getter in Women's T20I history

source: X

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన మరో ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ రెండో సెమీఫైనల్‌లో ఈ రికార్డు నెలకొల్పింది.

ఈ రికార్డు సాధించే క్రమంలో మంధన న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్‌ను అధిగమించింది. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 8 పరుగుల వద్ద మంధన ఈ రికార్డు సొంతం చేసుకుంది.

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు
స్మృతి మంధన- 4788
సుజీ బేట్స్- 4758
హర్మన్‌ప్రీత్ కౌర్- 4287
చమారి ఆటపట్టు- 4282
సోఫీ డివైన్- 3817

మంధన ఇప్పటికే మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లు కలిపి) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ కొనసాగుతుంది.

మరో అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో మంధన మరో ప్రత్యేక ఘనతను కూడా నమోదు చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో 600 ఫోర్లు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా.. ఓపెనర్లు మంధన (19 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షఫాలీ వర్మ (28 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తమ సహజ శైలిలో రెచ్చిపోవడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 

11 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోర్‌ 101-2గా ఉంది. మంధన, కమలిని (3) ఔట్‌ కాగా.. షఫాలీ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో శ్రీలంక పాక్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసకెళ్లింది. భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ విజేత ఫైనల్లో శ్రీలంకతో తలపడుతుంది. 

ఇదీ చదవండి: Asian Games Cricket: ఫైనల్స్‌కు దూసుకెళ్లిన శ్రీలంక



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement