Asian Games 2026: షూటింగ్‌ 'సిల్వర్‌'తో ఖాతా తెరిచిన భారత్‌ | Asian Games 2026: India Open Medal Account With Shooting Silver After Scripting MMA History | Sakshi
Sakshi News home page

Asian Games 2026: షూటింగ్‌ 'సిల్వర్‌'తో ఖాతా తెరిచిన భారత్‌

Sep 20 2026 10:27 AM | Updated on Sep 20 2026 10:27 AM

Asian Games 2026: India Open Medal Account With Shooting Silver After Scripting MMA History

జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల వేట ప్రారంభమైంది. క్రీడల తొలి రోజే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఎలావెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్సా వినోద్ రజత పతకం సాధించారు. ఈ ఈవెంట్‌లో చైనా స్వర్ణం సాధించగా.. ఆతిథ్య జపాన్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది.

మరో పతకం ఖాయం
మహిళల ట్రెడిషనల్ MMA (మిక్సడ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) 60 కేజీల విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరుకోవడంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.

హాకీ జట్టుకూ అదిరిపోయే ఆరంభం
భారత మహిళల హాకీ జట్టుకు అదిరిపోయే అరంభం లభించింది. ఉజ్బెకిస్తాన్‌పై టీమిండియా 19-0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. దీపిక 9 గోల్స్‌తో చెలరేగగా.. ఇషిక హ్యాట్రిక్‌ సాధించింది.

టేబుల్‌ టెన్నిస్‌లోనూ ఘనంగా బోణీ
మహిళల టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లోనూ భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. ఆకుల శ్రీజ, సుతిర్థ ముఖర్జీ, సిండ్రెల దాస్‌ జోడీ ఇండోనేషియా జోడీపై 3-0తో విజయం సాధించింది.

నేడు భారత్‌ కీలక ఈవెంట్లు
మహిళల క్రికెట్: బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్
పురుషుల హాకీ: ఇండోనేషియాతో తొలి మ్యాచ్
షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్
బ్యాడ్మింటన్: కజకిస్థాన్‌తో మహిళల టీమ్ మ్యాచ్
వుషు: భారత్‌ ఆటగాళ్లకు నాకౌట్ పోటీలు

ఇదీ చదవండి: మరో ముగ్గురికి టీమిండియా నుంచి పిలుపు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement