ప్రేక్షకులకు క్రికెట్ బుక్‌లెట్‌లు
నగోయా: ఆసియా క్రీడల్లో వరుసగా రెండో సారి క్రికెట్ భాగమైంది. అయితే చైనాలో జరిగిన గత క్రీడల తరహాలోనే ఈ సారి జపాన్‌లో కూడా ఆటపై పెద్దగా అవగాహన లేదు. జపాన్ జట్టు ఇప్పటికే ఐసీసీ గుర్తింపు పొంది 61 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడినా... సగటు క్రీడాభిమానికి అది ఇంకా చేరువ కాలేదు. ఇలాంటి స్థితిలో జపాన్‌లో ఆసియా క్రీడల్లో క్రికెట్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్నాయి.
ఈ మెగా ఈవెంట్‌లో వేర్వేరు క్రీడలను ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమైన జపాన్ అభిమానులు క్రికెట్ మ్యాచ్‌లకు కూడా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఆటపై మరింత అవగాహన కలి్పంచాలని నిర్వాహకులు భావించారు. ఆటకు సంబంధించి ప్రాధమిక అంశాలను వివరిస్తూ ప్రత్యేకంగా బుక్‌లెట్‌లు తయారు చేశారు. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న కరోగీ స్పోర్ట్స్ పార్క్‌లో వీటిని పంచుతున్నారు. జట్టులోని ఆటగాళ్ల సంఖ్య, ఫీల్డింగ్ స్థానాలు, పరుగుల లెక్క, అవుటయ్యే తీరు... ఇలా అంపైర్ల సైగలతో సహా ఈ బుక్‌లెట్‌లో ముద్రించారు. ఇవన్నీ కూడా స్థానిక జపానీ భాషలోనే ఉండటం విశేషం.


