నేడు సెమీఫైనల్ మ్యాచ్
ఉ.గం. 10:30 నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం
నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో పసిడి పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌పై అలవోక విజయం సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... అదే జోరు కొనసాగిస్తూ ఫైనల్ చేరాలని భావిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చితే ఈ మ్యాచ్‌లో విజయం నల్లేరుపై నడకే. బంగ్లాతో జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించడం గమనార్హం.
ఇటీవల ఆసియా కప్‌లో కూడా బంగ్లాదేశ్‌పై భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భారతి ఫూల్‌మాలి, దీప్తి శర్మతో కూడిన భారత జట్టును ఎదుర్కోవాలంటే బంగ్లా శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో ఆంధ్ర స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారగా... దీప్తి శర్మ, షఫాలీ, రాధ, నందని ఆమెకు సహకారం అందిస్తున్నారు. మరోవైపు కెపె్టన్ నిగార్ సుల్తానా, నహీద అక్తర్, రాబియా ఖాన్ రూపంలో బంగ్లా జట్టులోనూ అనుభవజు్ఞలు అందుబాటులో ఉన్నారు.
ఏషియాడ్‌లో నేటి భారత షెడ్యూల్ 


