గౌతం గంభీర్ (PC: Sonysports X)
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 244 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలత బౌలర్లు వైఫల్యం కారణంగా కివీస్ జట్టు ఏకంగా 333 పరుగులు చేసింది.
89 పరుగులకే ఆలౌట్
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బ్యాటర్లు విఫలమైన తీరు వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి ముందు తీవ్ర ప్రభావం చూపుతుందన్నాడు.
కనీస ప్రయత్నమైనా చేయాలి
అదే విధంగా బౌలర్ల ప్రస్తావన రాగా.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆట తీరుపై గంభీర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విదేశీ పిచ్‌లపై స్పిన్నర్లకు చాలా తక్కువగా ఆడే అవకాశం వస్తుంది. అయితే, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమైనా చేయాలి.

PC: BCCI
ఇక్కడ అతడు ఎన్ని మ్యాచ్‌లు ఆడాడన్న విషయంతో సంబంధం లేదు. గత నెల (అక్టోబరు)లో సొంతగడ్డ మీద వెస్టిండీస్‌తో అతడు మూడు వన్డేలు ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ దేశానికి పర్యటనకు వెళ్లినపుడు ఇక్కడి పిచ్‌లకు తగ్గట్లుగా ఆట తీరును మార్చుకోవాలి కదా!
అవకాశం ఇచ్చినా ఫెయిల్ అయ్యాడు
కాబట్టి ముందు మ్యాచ్‌లలో అతడికి ఆడే అవకాశం ఇవ్వలేదనే విమర్శలకు అర్థం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో రిథమ్, లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా ఉంటే కచ్చితంగా ఏ మ్యాచ్‌లోనైనా బౌలర్ రాణించగలడు. అవకాశం ఇచ్చినపుడు విఫలమైతే మున్ముందు కష్టమే.
ఛాన్స్ ఇచ్చినపుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి కదా!’’ అని గంభీర్ కుల్దీప్ యాదవ్ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. తద్వారా సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి ఎంపిక చేసే జట్టులో ఈ స్పిన్ బౌలర్‌కు స్థానం ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చాడు.
తొమ్మిదికి పైగా ఎకానమీ రేటుతో
కాగా కివీస్‌తో మౌంట్ మౌంగనూయ్ వేదికగా ఈ పర్యటనలో తొలిసారి తుదిజట్టులో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం ఎనిమిది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొమ్మిదికి పైగా ఎకానమీ రేటుతో ఏకంగా 73 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఇదిలా ఉంటే.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉండగా.. మూడో వన్డే వర్షం వల్ల రద్దైంది. అయితే, కివీస్ నాలుగో వన్డే గెలిచి టీమిండియా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నిర్ణయాత్మక ఐదో వన్డేకు కూడా మౌంట్ మౌంగనూయ్ వేదిక.
ఇదీ చదవండి: ‘హెన్రీ గొప్పగా ఏం ఆడలేదు.. ఇలా అయితే వరల్డ్‌కప్‌లో మాకు కష్టమే’


