అభిషేక్, వైభవ్ (ఫైల్ ఫొటోలు- PC: BCCI X)
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమై.. అభిమానులను నిరాశపరిచాడు. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 వన్డే టోర్నమెంట్లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్లుగా టీమిండియా టీ20 స్టార్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ బరిలోకి దిగారు. ఆరంభం నుంచి ఇద్దరూ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలో నాలుగో ఓవర్ తొలి బంతికి అభిషేక్ శర్మ సిక్సర్ బాది టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. అయితే, అనూహ్య రీతిలో ఆరో ఓవర్ తొలి బంతికే అవుటయ్యాడు.
Abhishek Sharma opened India A’s six-hitting account with a maximum over fine leg! 💥 Watch India A vs Nepal in the #DPWorldAsiaCupRisingStarsMens2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/F3ydPxG192
— Sony Sports Network (@SonySportsNetwk) November 20, 2026
నందన్ యాదవ్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ అభిశేశ్ గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 13 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. తద్వారా వన్డే ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు.
మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ సైతం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. పవన్ సర్రాఫ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ బాట పట్టాడు.
A quick burst of Vaibhav magic! 💥 Watch India A vs Nepal in the #DPWorldAsiaCupRisingStarsMens2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV https://t.co/qjdArgNolK
— Sony Sports Network (@SonySportsNetwk) November 20, 2026
ఇక అభిషేక్‌తో కలిసి తొలి వికెట్‌కు 29 పరుగులు జోడించిన వైభవ్.. వన్‌డౌన్ బ్యాటర్ ఆయుశ్ బదోనితో రెండో వికెట్‌కు ఏడు.. కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి మూడో వికెట్ ఆరు పరుగులు జోడించాడు. కాగా టాపార్డర్ విఫలం కావడంతో భారత్ 11 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి కేవలం 42 పరుగులు చేయగలిగింది.


