చెలరేగిన భారత స్పిన్నర్‌.. 131 పరుగులకే జింబాబ్వే ఆలౌట్‌ | IND W vs ZIM W 3rd ODI: Vaishnavi Sharma 5 fer Zimbabwe 131 All Out | Sakshi
Sakshi News home page

చెలరేగిన భారత స్పిన్నర్‌.. 131 పరుగులకే జింబాబ్వే ఆలౌట్‌

Oct 28 2026 4:37 PM | Updated on Oct 28 2026 4:58 PM

IND W vs ZIM W 3rd ODI: Vaishnavi Sharma 5 fer Zimbabwe 131 All Out

వైష్ణవి శర్మ (PC: BCCI Women X)

జింబాబ్వే మహిళా క్రికెట్‌​ జట్టుతో నామమాత్రపు మూడో వన్డేలో భారత బౌలర్లు అదరగొట్టారు. పర్యాటక జట్టును 39.5 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌట్‌ చేశారు. కాగా భారత మహిళల క్రికెట్‌ జట్టు సొంతగడ్డపై సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగుతున్న సంగతి తెలిసిందే.

టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. వన్డే సిరీస్‌ కైవసం
ఇప్పటికే టీ20 సిరీస్‌ను టీమిండియా 3–0తో కైవసం చేసుకుంది. వన్డేల్లోనూ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో వడోదర వేదికగా బుధవారం నాటి ఆఖరి వన్డేలో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. ప్రత్యర్థికి చుక్కలు చూపింది.

కుప్పకూలిన బ్యాటింగ్‌ ఆర్డర్‌
జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్‌ మాడెస్టర్‌ ముపచిక్వా 37, కెప్టెన్‌ జోసెఫైన్‌ ఎన్‌కోమో 35, చీజా ధురురు 20, నైయాషా గ్వాంజుర 10 పరుగులు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఐదు వికెట్లతో అదరగొట్టిన వైష్ణవి శర్మ
భారత బౌలర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వైష్ణవి శర్మ ఐదు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించింది. మిగిలిన వారిలో సయాలి సత్గరే, క్రాంతి గౌడ్‌ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఇదిలా ఉంటే..  జింబాబ్వేతో తొలి వన్డేలో ప్రతీక రావల్‌ సెంచరీతో ఆకట్టుకోగా...  రెండో మ్యాచ్‌లో మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ ‘శత’క్కొట్టారు. టాపార్డర్‌లో కెప్టెన్‌ స్మృతి మంధాన భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది.

భారత్‌
ప్రతీకా రావల్‌, స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలి వర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, దీప్తి శర్మ, యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), సయాలీ సత్గరే, జింతిమణి కలిత, క్రాంతి గౌడ్‌, వైష్ణవి శర్మ

జింబాబ్వే
మాడెస్టర్‌ ముపాచిక్వా (వికెట్‌ కీపర్‌), లోరిన్‌ ఫిరి, చిపో ముగెరి-టిరిపానో, బిలవ్డ్‌ బిజా, జోసెఫైన్‌ ఎన్‌కోమో (కెప్టెన్‌), నైయాశా గ్వాంజుర, చీజా ధురురు, మిచెల్లి మవుంగ, నోమ్‌వెలో సిబాండ, ఫ్రాన్సిస్కికా చిపారే, ఓలిండర్‌ చేర్‌.

ఇవీ చదవండి: అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement