breaking news
Sayali Satghare
-
ఆఖరి వరకు ఉత్కంఠ: ఆసీస్‌తో రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు చేతిలో భారత మహిళా ‘ఎ’ జట్టుకు పరాజయం ఎదురైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో అనధికారిక వన్డేలో పర్యాటక ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఆల్ ఫార్మాట్ సిరీస్‌కాగా మూడు అనధికారిక టీ20లు, మూడు అనధికారిక వన్డేలు, ఒక అనధికారిక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను కంగారూ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఈ క్రమంలో భారత్- ఆసీస్ మహిళల ‘ఎ’ జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, తాజాగా రెండో వన్డేలో మాత్రం ఓటమిపాలైంది.మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో బుధవారం టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తనీశా సింగ్ (37), ప్రియా పునియా (36) శుభారంభం అందించగా.. కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా శతక్కొట్టింది.కెప్టెన్ విధ్వంసకర శతకంమొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న యస్తికా.. 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 112 పరుగులు సాధించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తేజల్ హసాబ్నిస్ (60), అనుష్క శర్మ (60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్ములేపారు. మిగిలిన వారిలో నికీ ప్రసాద్ డకౌట్ కాగా.. మిన్ను మణి (3) విఫలమైంది. ఆఖర్లో సయాలీ సత్గరే 12 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది.ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్ 338 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. మిల్లీ ఇల్లింగ్‌వర్త్ రెండు వికెట్లు కూల్చింది. లిల్లీ మిల్స్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ నికోలీ ఫాల్తుమ్ (12)ను సయాలీ సత్గరే తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపింది. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.మెరుపులు మెరిపించారుమరో ఓపెనర్, కెప్టెన్ తాహిలా విల్సన్ (79), వన్‌డౌన్ బ్యాటర్ అనికా లిరాయిడ్ (54) అర్ధ శతకాలతో దుమ్మురేపారు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ చార్లి నాట్ (37 బంతుల్లోనే 63) టీ20 తరహాలో మెరుపులు మెరిపించింది. మిగిలిన వారిలో టెస్ ఫ్లింటాఫ్ (38), హేలీ సిల్వర్ హోమ్స్ (47) కూడా రాణించారు.లిల్లీ మిల్స్ 12 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి కేవలం ఐదు పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటికి మిల్లీ ఇల్లింగ్‌వర్త్ 18, డేసీ బ్రౌన్ ఒక పరుగుతో ఉన్నారు. చివరి ఓవర్లో నికీ ప్రసాద్ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతి వైడ్ అయింది.ఆఖరి ఓవర్లో ఉత్కంఠ.. చివరికిమరుసటి బంతికి పరుగు తీయలేకపోయి బ్రౌన్.. రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ మిల్లీకి ఇచ్చింది. ఈ క్రమంలో మూడో బంతి నోబాల్ కాగా.. తద్వారా లభించిన ఫ్రీ హిట్‌ను మిల్లీ ఫోర్‌గా మలిచింది. దీంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ జయభేరి మోగించింది. 49.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.భారత బౌలర్లలో మిన్ను మణి మూడు వికెట్ల తీయగా.. నికీ ప్రసాద్, సయాలి సత్గరే చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వైష్ణవి శర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది. భారత్- ఆసీస్ మధ్య శుక్రవారం నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఇందుకు మొహాలీ వేదిక.చదవండి: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. కెప్టెన్ సెంచరీ.. ఆసీస్‌పై భారత్ గెలుపు -
‘ఆర్సీబీ’కి దెబ్బే.. ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!
వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎలిస్ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్ పెర్రీ ప్రకటించింది.అత్యధిక పరుగులుగత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్‌కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.ఇక గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్‌లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. సదర్లాండ్ కూడామరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్ సదర్లాండ్ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్‌కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్ స్థానంలో ఆసీస్ లెగ్‌స్పిన్నర్ అలానా కింగ్‌ను క్యాపిటల్స్ తీసుకుంది. కింగ్ గత ఏడాది యూపీ వారియర్స్ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ప్లేయర్‌కు ఎవరూ సాటిరారు!‘‘ఈసారి ఎలిస్ పెర్రీ రావడం లేదు. అనాబెల్ సదర్లాండ్ కూడా ఈ సీజన్ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్‌గా ఉంది.కానీ ఎలిస్ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్ సెట్ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. అనాబెల్ స్థానంలో అలనా సరైన ప్లేయర్ కాదని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. అనాబెల్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగలదన్న ఆకాశ్ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్ మాత్రమే అని.. బ్యాటింగ్ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.తారా నోరిస్ దూరంఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్ జట్టు సభ్యురాలు తారా నోరిస్ కూడా లీగ్‌కు దూరమైంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ చార్లీ నాట్‌ను వారియర్స్ జట్టులోకి ఎంచుకుంది. నాట్ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్ ఆడలేదు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్!


