హర్మన్‌, దీప్తీ భారీ సెంచరీలు.. టీమిండియా 328 పరుగుల భారీ స్కోర్‌ | Harmanpreet Kaur, Deepti Sharma centuries power India to 328/6 | Sakshi
Sakshi News home page

IND vs NZ: హర్మన్‌, దీప్తీ భారీ సెంచరీలు.. టీమిండియా 328 పరుగుల భారీ స్కోర్‌

Oct 25 2026 5:47 PM | Updated on Oct 25 2026 6:52 PM

Harmanpreet Kaur, Deepti Sharma centuries power India to 328/6

వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు సత్తాచాటారు. కెప్టెన్ స్మృతి మంధాన(0), షఫాలీ వర్మ(8) ఆరంభంలోనే ఔటైనప్పటికి..మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌, ఆల్‌రౌండర్‌ దీప్తీ శర్మ అద్భుతమైన సెంచరీలతో కదం తొక్కారు.

షఫాలీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హర్మన్ తనదైన శైలిలో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది.  కేవలం 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేసి ఔటైంది. ఆమెతో పాటు దీప్తీ శర్మ కేవలం 86 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు సాధించి అజేయంగా నిలిచింది.

అదేవిధంగా ఓపెనర్ ప్రతీకా రావల్‌(61) హాఫ్ సెంచరీతో రాణించింది.  ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. .జింబాబ్వే బౌలర్లలో నోమ్వెలో సిబాన్డా 2 వికెట్లు తీయగా, ఒలిండా చారే, మిచెల్ మవుంగా, టెండాయ్ మకూషా, న్యాషా గ్వాన్జుర తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement