కోహ్లీ, మురళీ విజయ్ అర్థసెంచరీలు | virat kohli and murali vijay hit half centuries in first test | Sakshi
Sakshi News home page

కోహ్లీ, మురళీ విజయ్ అర్థసెంచరీలు

Dec 13 2014 9:24 AM | Updated on Sep 2 2017 6:07 PM

కోహ్లీ, మురళీ విజయ్ అర్థసెంచరీలు

కోహ్లీ, మురళీ విజయ్ అర్థసెంచరీలు

దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ మురళీ విజయ్కి కెప్టెన్ విరాట్ కోహ్లీ తోడయ్యాడు. ఇక పరుగులు వరదలా రావడం మొదలైంది.

దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ మురళీ విజయ్కి కెప్టెన్ విరాట్ కోహ్లీ తోడయ్యాడు. ఇక పరుగులు వరదలా రావడం మొదలైంది. ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ కోహ్లీ ఇద్దరూ అర్థసెంచరీలు పూర్తిచేశారు. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో శిఖర్ ధవన్ 9 పరుగులకే వెనుదిరగడం కొద్దిసేపు భారత జట్టును నిరాశపరిచినా, ఓవైపు మురళీ విజయ్, మరోవైపు విరాట్ కోహ్లీ చేతికి అందిన చెత్తబంతినల్లా బాదడం మొదలుపెట్టారు. దాంతో రెండో ఇన్నింగ్స్లో భారత్ 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

మురళీ విజయ్ 6 ఫోర్లు, 1 సిక్సర్తో 165 బంతుల్లో 66 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత దూకుడు ప్రదర్శించాడు. కేవలం 86 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి.. 66 పరుగులు చేశాడు. దీంతో విజయానికి కేవలం 199 పరుగులు చేస్తే సరిపోయే స్థితికి భారత జట్టు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement