భారత సంతతి క్రికెటర్ల విధ్వంసం.. కెనడా చేతిలో ఒమన్ చిత్తు | Canada Batters Half Centuries-ODI Match-Vs Oman-ICC-WC-League Tourney | Sakshi
Sakshi News home page

ICC Cricket World Cup League: భారత సంతతి క్రికెటర్ల విధ్వంసం.. కెనడా చేతిలో ఒమన్ చిత్తు

Oct 15 2026 6:24 PM | Updated on Oct 15 2026 6:54 PM

Canada Batters Half Centuries-ODI Match-Vs Oman-ICC-WC-League Tourney

Photo Credit: Twitter

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్‌క‌ప్ లీగ్‌-2 (2023-27)లో భాగంగా ఒమ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కెన‌డా జ‌ట్టు 58 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత సంతతి క్రికెటర్లు అర్థసెంచరీలతో చెలరేగిన వేళ, అనంతరం బౌలర్లు రాణించడంతో ఒమన్ చిత్తుగా ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెన‌డా జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 256 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

భారత సంతతి క్రికెటర్లు స‌మిత్ గోహెల్ (67), ఆదిత్య వ‌ర‌ద‌రాజ‌న్ (55) అర్థ‌సెంచ‌రీలతో చెలరేగారు. ఆఖ‌ర్లో హ‌మ్జా తారిక్ (36 నాటౌట్‌) రాణించ‌డంతో కెన‌డా 250 ప‌రుగుల మార్క్‌ను దాటింది. ఒమ‌న్ బౌల‌ర్ల‌లో హ‌స్నైన్ షా మూడు వికెట్లు తీయ‌గా, జె ఒదేరా, ముజిబుర్ అలీ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

అనంత‌రం 257 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఒమ‌న్ జ‌ట్టు ఏ ద‌శ‌లోనూ ల‌క్ష్యం దిశ‌గా సాగ‌లేదు. 46.3 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. హ‌మ్మ‌ద్ మీర్జా (49) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఆఖ‌ర్లో హ‌స్నైన్ షా (27) పోరాడిన‌ప్ప‌టికీ అత‌డికి స‌హ‌కారం అందించేవారు క‌రువ‌య్యారు. కెన‌డా బౌల‌ర్ల‌లో జ‌హిద్ షిర్జాద్‌, షీల్ ప‌టేల్‌లు చెరో 3 వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement