Photo Credit: Twitter
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారీ విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియాకు రెండో టెస్టుకు ముందు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా గాయానికి గురైన ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ రెండో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే తొలి టెస్టుకు దూరంగా ఉన్న గ్రీన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని జట్టు హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్పష్టం చేశాడు. ''గ్రీన్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు కోలుకోవడానికి మూడు లేదా నాలుగు రోజులు పట్టవచ్చు. ఒకవేళ ఈ సిరీస్లో గ్రీన్ ఆడినప్పటికీ, బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవనున్నాడు.'' అని చెప్పుకొచ్చాడు.
గాయంతో బాధపడుతున్న గ్రీన్ వాస్తవానికి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో అర్థసెంచరీ, రెండో టెస్టులో సెంచరీ సాధించిన గ్రీన్ మూడు ఇన్నింగ్స్లు కలిపి 184 పరుగులు చేశాడు. గ్రీన్ పరిస్థితి ఇలా ఉంటే, గాయం నుంచి కోలుకున్న జోష్ ఇంగ్లిస్ నెట్స్లో సాధన చేయడం కనిపించింది. రెండో టెస్టులో జోష్ ఇంగ్లిస్ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చదవండి:


