చీఫ్‌ సెలెక్టర్‌గా రమేశ్‌ పవార్‌..? ఓజా తాత్కాలికమే..! | BCCI Eyes 2 Names For Senior And Junior Selection Committee Chair, Says Report | Sakshi
Sakshi News home page

చీఫ్‌ సెలెక్టర్‌గా రమేశ్‌ పవార్‌..? ఓజా తాత్కాలికమే..!

Oct 15 2026 5:03 PM | Updated on Oct 15 2026 5:10 PM

BCCI Eyes 2 Names For Senior And Junior Selection Committee Chair, Says Report

source: X

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసు రంజుగా మారింది. ఈ పదవి నుంచి అజిత్‌ అగార్కర్‌ వైదొలగడంతో తాత్కాలిక చైర్మన్‌గా ప్రజ్ఞాన్‌ ఓజా కొనసాగుతున్నాడు. నిన్నటి వరకు ఓజానే రెగ్యులర్‌ చైర్మన్‌గా నియమిస్తారని ప్రచారం జరిగింది.

అయితే ఉన్నట్టుండి ఇవాళ రేసులోకి కొత్త వ్యక్తి వచ్చాడు. అతడి పేరు రమేశ్‌ పవార్‌. ఇతను 2004 నుంచి 2007 మధ్య భారత జట్టు తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడి 40 వికెట్లు పడగొట్టాడు. రిటైర్ అయిన తర్వాత పవార్‌ కోచ్‌గా సేవలందించాడు.

భారత మహిళల జట్టుకు రెండు విడతల్లో కోచ్‌గా పనిచేయడంతో పాటు జాతీయ క్రికెట్ అకాడమీలో పురుషుల క్రికెట్ విభాగంతో కలిసి పనిచేశాడు. ఆటగాడిగా, కోచ్‌గా ఉన్న అనుభవం పవార్‌కు  కలిసొచ్చే అవకాశం ఉంది. పైగా ఇతని వెనుక భారీ లాబీయింగ్‌ జరుగుతుందని సమాచారం.

ముందుగా రమేశ్‌ పవార్‌ పేరు జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌ రేసులో ఉండింది. ఉన్నట్టుండి అతడి పేరు సీనియర్‌ చీఫ్‌ సెలెక్టర్‌ రేసులోకి వచ్చింది.

జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌ రేసులో దొడ్డ గణేశ్‌..?
జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌ పదవి రేసులో కర్ణాటకకు చెందిన టీమిండియా మాజీ క్రికెటర్‌ దొడ్డ గణేశ్‌ పేరు బలంగా వినిపిస్తుంది. తొలుత ఈ పదవి రేసులో రమేశ్‌ పవార్‌ పేరు వినిపించింది. అయితే ఉన్నపళంగా సమీకరణలు మారిపోవడంతో పవార్‌ సీనియర్‌  చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో ఉన్నాడు. ఎస్. శరత్ ఇటీవలే తన పదవీకాలం ముగియడంతో జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

ఇదీ చదవండి: జింబాబ్వే కెప్టెన్ సికందర్‌ రజా కీల‌క నిర్ణ‌యం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement