ఏషియన్‌ గేమ్స్‌ విజేతలను అభినందించిన ప్రధాని మోదీ | PM Modi Felicitates Asian Games Contingent, Made 140 Crore Indians Proud | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌ విజేతలను అభినందించిన ప్రధాని మోదీ

Oct 15 2026 6:14 PM | Updated on Oct 15 2026 6:28 PM

PM Modi Felicitates Asian Games Contingent, Made 140 Crore Indians Proud

ఏషియన్‌ గేమ్స్‌ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అభినందించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో భారత క్రీడా బృందంతో సమావేశమైన ఆయన.. స్వర్ణ పతకాలు సాధించిన పురుషుల, మహిళల క్రికెట్ జట్ల సభ్యులతో పాటు ఇతర పతక విజేతలను ప్రశంసలతో ముంచెత్తారు.

ఈ సందర్భంగా మోదీ పతక వీరులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. “140 కోట్ల మంది భారతీయులను గర్వపడేలా చేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే అతిపెద్ద విజయం. మీ విజయాలు మీకు మాత్రమే పరిమితం కావు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు చెందినవి. యావత్ దేశం తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.

భారత క్రీడాకారులు తమ విజయాలతో దేశ ప్రతిష్ఠను పెంచారని ప్రధాని కొనియాడారు. ఈ సమావేశంలో క్రీడాకారులు మోదీతో ఫొటోలు దిగారు. పలువురు తమ జ్ఞాపికలను ఆయనకు అందజేశారు. 17 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి కుమ్కుమ్ మొహోద్ తన సంతకంతో కూడిన విల్లును ప్రధానికి బహూకరించింది. ఈ కార్యక్రమానికి ఐసీసీ ఛైర్మన్ జై షా సహా పలు క్రీడా సంఘాల ప్రముఖులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: సంజూ శాంసన్ అరుదైన రికార్డు.. రోహిత్, కోహ్లి సరసన చోటు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement