డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ చారిత్రత్మక విజయాన్ని అందుకుంది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టు ఫార్మాట్‌లో ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌ను బంగ్లా జట్టు నాలుగు రోజుల్లోనే ముగించింది. ఈ డార్విన్ టెస్ట్‌లో పర్యాటక బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది.
తొలుత కంగారుల జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి కేవలం 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ 6 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. అనంతరం యువ ఓపెనర్ తంజిద్ హసన్ (101) అద్భుత సెంచరీతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల భారీ స్కోరు సాధించింది.
దీంతో షాంటో సేన 228 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. 228 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్ ప్రత్యర్ధి జట్టుకు కేవలం 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో స్పందించాడు. తమ దేశ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత గొప్ప విజయమని షాంటో చెప్పుకొచ్చాడు.
"మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు ఎన్నో గొప్ప విజయాలు ఉన్నాయి. కానీ నా దృష్టిలో అయితే ఇప్పటివరకు మేము సాధించిన వాటిలో ఇదే అతి పెద్ద విజయం. దీని వెనుక ఎంతో కృషి ఉంది. ఈ మ్యాచ్ అసాంతం మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం.
మ్యాచ్‌ను ఆఖరి రోజు వరకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా బరిలోకి దిగాము. ప్రతీ సెషన్‌లోనూ పోరాడాలి అనుకున్నాము. మా ప్రణాళికలకు తగ్గట్టు మొదటి రోజు నుంచే మేము వారిపై పై చేయి సాధించాం. ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో షాంటో పేర్కొన్నాడు.
చదవండి: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్


