టీమిండియాను భారీ దెబ్బేసిన బంగ్లాదేశ్ | Bangladesh Historic Win Over Australia Shakes Up WTC Final Race And Hurts India Chances, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

టీమిండియాను భారీ దెబ్బేసిన బంగ్లాదేశ్

Aug 16 2026 12:37 PM | Updated on Aug 16 2026 1:58 PM

WTC Table: Bangladesh Dent India WTC Final Hopes With Historic Win Vs Australia

source: X

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించడంతో బంగ్లాదేశ్‌ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లైంది. ఈ గెలుపుతో ఆ జట్టు డబ్ల్యూటీసీ రేటింగ్‌ పాయింట్లను పెంచుకోవడమే కాకుండా  టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలను భారీగా దెబ్బేసింది. ఆసీస్‌పై బంగ్లా గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఈ విజయంతో బంగ్లాదేశ్ పాయింట్ల శాతం (PCT) 58.33 నుంచి 66.67కి పెరిగింది. దీంతో ఆ జట్టు నాలుగో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఆస్ట్రేలియా PCT 87.50 నుంచి 77.78కి పడిపోయింది. అయినప్పటికీ ఆసీస్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 75%, న్యూజిలాండ్ 72.22%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఐదో స్థానంలో భారత్a
ఆసీస్‌పై బంగ్లాదేశ్ విజయం భారత్‌కు పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం టీమిండియా 48.15% PCTతో ఐదో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇప్పుడు గణనీయమైన అంతరం ఏర్పడింది.

భారత్ WTC ఫైనల్‌కు చేరాలంటే ఇకపై మిగిలిన టెస్టుల్లో వీలైనన్ని ఎక్కువ విజయాలు సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఫలితాలు కూడా భారత అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి.

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డార్విన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి, ఆ దేశ గడ్డపై తమ తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 198 పరుగులకే ఆలౌట్ చేసిన బంగ్లాదేశ్, అనంతరం 426 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 284 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా జట్టు సునాయాసంగా ఛేదించి చారిత్రక విజయం సొంతం చేసుకుంది.

ఫైనల్ ఆశలు
చారిత్రక విజయం తర్వాత బంగ్లాదేశ్ WTC ఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా మారింది. ఆ జట్టుకు ఈ సైకిల్‌లో ఇంకా ఆస్ట్రేలియాతో మరో టెస్టుతో పాటు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లో వీలైనన్ని గెలిస్తే బంగ్లాదేశ్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఆసీస్‌తో రెండో టెస్ట్‌ మెక్‌కే వేదికగా ఆగస్ట్‌ 22 నుంచి ప్రారంభమవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement