బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండర్ మైఖేల్ నెసర్ కూడా చేరాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లో నెసర్ కుడి పిక్క గాయానికి గురయ్యాడు.
ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు నెసర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ధ్రువీకరించాడు.
కాగా బంగ్లాతో టెస్టుల కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల ఆసీస్ ప్రధాన జట్టులో నెసర్ లేడు. కానీ కమిన్స్, హేజిల్‌వుడ్‌లకు బ్యాకప్ బౌలర్‌గా తీసుకోవాలని ఆసీస్ సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు అతడు గాయపడడంతో మరో ప్రత్యామ్నాయ బౌలర్‌ను వెతుక్కోవాల్సి వచ్చింది.
యాషెస్ సిరీస్‌లో ఆడిన బ్రెండన్ డాగెట్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న జోష్ ఇంగ్లిష్ మాత్రం తొలి టెస్ట్ సమయానికి కోలుకుంటున్నాడని మెక్‌డొనాల్డ్ స్పష్టం చేశాడు. ఇక ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా బంగ్లాదేశ్-ఆసీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మాన్ ఇస్లాం, తంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, హసన్ మహ్ముద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాడత్ హొస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్, లిట్టన్ దాస్.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు..
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్


