చ‌రిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్‌.. 68 ఏళ్ల రికార్డు బ్రేక్‌ | Abdullah Shafique Breaks 68-Year-Old Record With Dream Test Comeback In PAK Vs WI 2026 | Sakshi
Sakshi News home page

WI vs PAK: చ‌రిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్‌.. 68 ఏళ్ల రికార్డు బ్రేక్‌

Aug 5 2026 12:34 PM | Updated on Aug 5 2026 12:50 PM

Abdullah Shafique Breaks 68-Year-Old Record With Dream Test Comeback In PAK Vs WI 2026

పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్ అబ్దుల్లా షఫీక్ టెస్టుల్లో త‌న పున‌రాగ‌మానాన్ని ఘ‌నంగా చాటుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ష‌ఫీక్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.  323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 160 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు సాధించడంలో షఫీక్‌ది కీలక పాత్ర. ఈ అజేయ ఇన్నింగ్స్‌తో షఫీక్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెగ్యులర్‌గా పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే షఫీక్ ఈ మ్యాచ్‌లో మాత్రం మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. తద్వారా

విండీస్ గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన పాకిస్తాన్ బ్యాటర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సయీద్ అహ్మద్ పేరిట ఉండేది. 1958లో సయీద్ అహ్మద్ విండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 150 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో షఫీక్ ఏకంగా 68 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ పట్టు బిగించింది. విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం కరేబియన్ జట్టు 60 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement