breaking news
Michael Neser
-
Ashes: ఆస్ట్రేలియా తుదిజట్టులో అనూహ్య మార్పు
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్‌తో ఆసీస్ సారథి, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ పునరాగమం చేస్తున్నట్లు వెల్లడించింది. అతడితో పాటు వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చినట్లు తెలిపింది. 2-0తో ఆధిక్యంలోకాగా గాయం నుంచి కోలుకునే క్రమంలో.. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా కమిన్స్ (Pat Cummins) చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు అతడు అందుబాటులో లేకుండా పోయాడు. కమిన్స్ స్థానంలో జట్టును ముందుకు నడిపించిన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. వరుస విజయాలు అందుకున్నాడు.ఫలితంగా ఆసీస్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక పెర్త్ టెస్టులో నాథన్ లియోన్‌ను ఆడించిన యాజమాన్యం.. బ్రిస్బేన్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టు నుంచి తప్పించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లు బ్రెండన్ డాగట్ (Brendan Doggett ) మెరుగ్గా రాణించగా.. మైకేల్ నెసర్ (Michael Neser) రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.నెసర్, డాగట్‌లపై వేటు.. ఖవాజాకు షాక్ అయితే, మూడో టెస్టుకు కమిన్స్ తిరిగి రాగా.. సెలక్టర్లు ఈసారి నాథన్ లియోన్‌కు కూడా అవకాశం ఇచ్చారు. దీంతో నెసర్, డాగట్‌లపై వేటు పడింది. పిచ్ స్వభావం దృష్ట్యానే నాథన్ కోసం నెసర్‌ను అనూహ్య రీతిలో పక్కన పెట్టారా అనే చర్చ నడుస్తోంది. అదే విధంగా.. వెన్నునొప్పి వల్ల రెండో టెస్టుకు దూరమైన ఓపెనింగ్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను కూడా మేనేజ్మెంట్ మరోసారి పక్కనపెట్టింది. ఓపెనింగ్ జోడీగా ట్రవిస్ హెడ్- జేక్ వెదరాల్డ్ రాణిస్తుండటంతో ఖవాజాకు మొండిచేయి చూపింది. కాగా డిసెంబరు 17 నుంచి ఆసీస్- ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మొదలుకానుంది. ఇందుకు అడిలైడ్ వేదిక.ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ఆసీస్ తుదిజట్టుట్రవిస్ హెడ్, జేక్ వెదరాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో జోష్ టంగ్ ఆసీస్ జరిగే యాషెస్ సిరీస్ మూడో టెస్టులో పాల్గొనే ఇంగ్లండ్ తుది జట్టును సోమవారమే ప్రకటించారు. పేసర్ గుస్ అట్కిన్సన్ స్థానంలో మరో బౌలర్ జోష్ టంగ్ జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన జోష్ టంగ్ 19 వికెట్లతో అదరగొట్టాడు. టంగ్‌కిది రెండో యాషెస్ టెస్టు కానుంది. కాగా 2023లో లార్డ్స్ జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ‘యాషెస్’ టెస్టు ఆడిన టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇంగ్లండ్ జట్టుజాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, విల్ జాక్స్, జోష్ టంగ్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్. చదవండి: మాక్ వేలంలో రూ. 30.50 కోట్లకు అమ్ముడుపోయిన గ్రీన్.. ఎవరు కొన్నారంటే? -
బీజీటీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇన్ ఫామ్ బౌలర్‌కు గాయం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బౌలర్ మైఖేల్ నెసర్ గాయపడ్డాడు. భారత్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ సందర్భంగా నెసర్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ను కకావికలం చేసిన నెసర్.. తన 13వ ఓవర్లో గాయం బారిన పడి అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో నెసర్ తిరిగి ఆడటం అనుమానమే అని తెలుస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రకటించబోయే ఆస్ట్రేలియా జట్టులో నెసర్‌కు చోటు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ లోపే అతను గాయపడటం ఆస్ట్రేలియా కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడటం ఆస్ట్రేలియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే కెమరూన్ గ్రీన్ గాయం కారణంగా ఈ సమ్మర్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా నెసర్ కూడా గాయపడటం ఆస్ట్రేలియా శిబిరంలో ఆందోళన కలిగిస్తుంది. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్తో ఆసీస్‌కు ఓపెనర్ సమస్య ఎలాగూ ఉంది. వార్నర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారనే అంశంపై ఇప్పటికీ క్లారిటీ లేదు.34 ఏళ్ల రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన నెసర్.. ఆస్ట్రేలియా-ఏ తరఫున ప్రాతినిథ్యం వహిస్తూ.. భారత్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో నెసర్ గాయపడక ముందు అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ వికెట్లు తీశాడు. నెసర్ సెన్సేషపల్ స్పెల్ కారణంగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 161 పరుగులకే ఆలౌటైంది. ధృవ్ జురెల్ వీరోచితంగా పోరాడి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (80) చేయడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో జురెల్ మినహా ఎవ్వరూ రాణించలేదు. అభిమన్యు ఈశ్వరన్ 0, కేఎల్ రాహుల్ 4, సాయి సుదర్శన్ 0, రుతురాజ్ గైక్వాడ్ 4, పడిక్కల్ 26, నితీశ్ రెడ్డి 16, తనుశ్ కోటియన్ 0, ఖలీల్ అహ్మద్ 1, ప్రసిద్ద్ కృష్ణ 14 పరుగులు చేశారు. భారత్‌ను 161 పరుగులకే కుప్పకూల్చిన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. మార్కస్ హ్యారిస్ (26), సామ్ కొన్‌స్టాస్ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆస్ట్రేలియా ఇంకా 108 పరుగులు వెనుకపడి ఉంది. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ నవంబర్ 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది. -
నెసర్ ఆల్‌రౌండ్ షో.. స్టీవ్ స్మిత్ లేని సిక్సర్స్‌ను కొట్టి ఫైనల్‌కు చేరిన హీట్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఛాలెంజర్ గేమ్‌లో బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ సిక్సర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, తుది సమరంలో పెర్త్ క్కార్చర్స్తో ఢీకి సిద్ధమైంది. లోకల్ (ఆసీస్) స్టార్ ఆటగాళ్లంతా ఇండియా టూర్ (4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్)కు వెళ్లడంతో చప్పగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. కున్నెమన్ (3/17), స్పెన్సర్ జాన్సన్ (3/28), మైఖేల్ నెసర్ (2/28), మెక్ స్వీనీ (1/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేసింది. The winning moment! From the man who stole the show. What a performance by Michael Neser and the @HeatBBL #BBL12 #BBLFinals pic.twitter.com/zWuwlsv8QE — KFC Big Bash League (@BBL) February 2, 2023 డేనియల్ హ్యూస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 117 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హీట్‌ను.. నెసర్ (32 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో ఈ జట్టు కూడా వడివడిగా వికెట్లు కోల్పోయినా నెసర్ ఒక్కడే నిలబడి, ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. హీట్ టీమ్ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్ బ్రౌన్ (20) ఓ మోస్తరుగా రాణించాడు. సిక్సర్స్ బౌలర్లలో నవీద్ 2, స్టీవ్ ఓకీఫ్, సీన్ అబాట్, డ్వార్షుయిష్ తలో వికెట్ దక్కించుకున్నారు. THE BOYS ARE GOING TO THE SHOW! 🎥 @marnus3cricket (Instagram) #BBL12 #BBLFinals pic.twitter.com/4Q79Fihd8O — KFC Big Bash League (@BBL) February 2, 2023 ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగిన నెసర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో బ్రిస్బేన్ హీట్ టీమ్.. పెర్త్ స్కార్చర్స్‌తో టైటిల్ కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ లాంటి విధ్వంసకర వీరుల మెరుపులతో బీబీఎల్ కళకళలాడింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా భారత పర్యటనలో ఉండటంతో లీగ్ కళావిహీనంగా, ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా దాదాపుగా ఇలాగే సాగవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. Ice cool under pressure, Michael Neser's batting tonight was something to behold. @KFCAustralia | #BBL12 | #BBLFinals pic.twitter.com/ZROhw7aWIW — KFC Big Bash League (@BBL) February 2, 2023 -
సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా?
Big Bash League 2022-23- Sensational Catch: బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ క్రికెటర్ మైఖేల్ నీసర్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఇంతకీ అది.. అవుటా? కాదా’’ అన్న అంశంపై చర్చ నడుస్తోంది. కొంతమందేమో ఇదో గొప్ప క్యాచ్ అని నీసర్ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలా కూడా అవుట్ ఇస్తారా అని అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హీట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ.. గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది. అయితే, 209 పరుగులకు ఆలౌట్ కావడంతో బ్రిస్బేన్ హీట్ 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయితే, సిడ్నీ ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు మిడిలార్డర్ ఆటగాడు జోర్డాన్ సిల్క్ అవుట్ కాకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిల్క్ పెవిలియన్ చేరాడు. హీట్ బౌలర్ స్టీకెటీ బౌలింగ్‌లో మైకేల్ నాసర్ పట్టిన సంచలన క్యాచ్ కారణంగా అవుటయ్యాడు. పందొమ్మిదో ఓవర్ రెండో బంతిని సిల్క్ షాట్ ఆడే క్రమంలో లాంగాఫ్‌లో నీసర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన నీసర్ బౌండరీ దాటే సమయంలో బాల్‌ను గాల్లోకి ఎగిరేశాడు. బౌండరీ అవతల బంతి గాల్లో ఉండగా.. తన అడుగులు కిందపడకుండా.. బంతిని ఒడిసిపట్టి.. మళ్లీ ఇవతలకు విసిరేసి.. బౌండరీ దాటి క్యాచ్ పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది దీనిని అవుట్ ఇవ్వడం కరెక్టే అంటూ ఉండగా.. మరికొందరు మాత్రం పాపం సిల్క్ అంటూ జాలిపడుతున్నారు. అది సిక్సరా లేదంటే అవుటా అన్న విషయం తేల్చలేక ఇంకొందరు అయోమయంలో పడిపోయారు. అది సిక్సర్ అయి ఉంటే సిల్క్ తమ జట్టును తప్పక విజయతీరాలకు చేర్చేవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం.. బౌండరీ లైన్ అవతల క్యాచ్ అందుకునే, దానిని విసిరేసే సమయంలో ఫీల్డర్ గ్రౌండ్‌కు టచ్ కాక.. ఇవతల బాల్‌ను అందుకుంటే అది క్యాచే! చదవండి: BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం Michael Neser's juggling act ends Silk's stay! Cue the debate about the Laws of Cricket... #BBL12 pic.twitter.com/5Vco84erpj — cricket.com.au (@cricketcomau) January 1, 2023


