బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, స్పిన్నర్ తన్వీర్ సంఘా దూరమయ్యారు. మార్ష్ చీలమండ గాయం (Ankle Injury) కారణంగా తప్పుకోగా.. డేంజరస్ ఓపెనర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతి ఇచ్చింది.
మరోవైపు పాకిస్తాన్ పర్యటనలో గాయపడిన తన్వీర్ సంఘా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇక మరోసారి మార్ష్ స్ధానంలో జట్టు పగ్గాలను వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ అప్పగించింది.
అయితే జూన్ 17 నుంచి బంగ్లాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ సమయానికి జట్టుతో మార్ష్ కలుస్తాడని సెలెక్టర్ టోనీ డోడెమైడ్ తెలిపారు. కాగా కొత్తగా వన్డే జట్టులోకి మాథ్యూ షార్ట్, ఓలివర్ పీక్, టాడ్ మర్ఫీ వచ్చారు. ఓలివర్ పీక్, షార్ట్ పాకిస్తాన్‌తో వన్డేలు ఆడినప్పటికి.. మర్పీకి మాత్రం తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది.
కాగా ఇరు జట్ల మధ్య ఈ వన్డే సిరీస్ జూన్ 9 (మంగళవారం) నుండి ఢాకాలో ప్రారంభం కానుంది. పాక్‌తో సిరీస్‌ను 2-1తో కోల్పోయిన కంగారులు తిరిగి తమ రిథమ్‌ను అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు.
బంగ్లాతో వన్డేలకు ఆసీస్ జట్టు
జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ కారీ, కూపర్ కానల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, టాడ్ మర్ఫీ, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్‌షా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే


