ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. 55 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలోనే | New Embarrassment For Australia, Puts 55 Years Of ODI Legacy To Shame In 2nd ODI vs Bangladesh | Sakshi
Sakshi News home page

AUS vs BAN: ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. 55 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలోనే

Jun 11 2026 12:39 PM | Updated on Jun 11 2026 12:53 PM

New Embarrassment For Australia, Puts 55 Years Of ODI Legacy To Shame In 2nd ODI vs Bangladesh

బంగ్లాదేశ్‌తో తొలి వ‌న్డేలో ఘోర ఓట‌మి చ‌విచూసిన ఆస్ట్రేలియాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఢాకా వేదిక‌గా జ‌రుగుతున్న రెండో వ‌న్డేలోనూ ఆసీస్ టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు తేలిపోయారు. బంగ్లా పేస్ బౌల‌ర్ల ధాటికి కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది.

టాస్కిన్ అహ్మ‌ద్ వేసిన‌ మొద‌టి ఓవ‌ర్‌లో నాలుగో బంతికి మాథ్యూ షార్ట్ ఖాతా తెర‌వ‌కుండానే క్లీన్ బౌల్డ‌య్యాడు. అంత‌కుముందు తొలి వ‌న్డేలో కూడా ఇదే త‌ర‌హాలో షార్ట్ అవుట‌య్యాడు.  ఆ తర్వాత రెండో ​ఓవర్‌ వేసిన ముస్తాఫిజుర్‌ పర్యాటక జట్టను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి కూపర్‌ కొన్నోలీ(0).. ఆఖరి బంతికి రెన్‌షా(0) వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యారు. 

దీంతో ఆస్ట్రేలియా తమ స్కోర్ బోర్డు ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తద్వారా ఆసీస్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకుంది.  ఆస్ట్రేలియా తమ 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు కూడా బోర్డుపై లేకుండా 3 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.

అంతేకాకుండా ఈ ఘోరమైన రికార్డు నమోదు చేసిన తొలి ఆసియా యేతర జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాపై ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా   కంగారులు కూడా ఈ జాబితాలో చేరారు. ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. 23 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ జోష్‌ ఇంగ్లిష్‌(34), గ్రీన్‌(25) కాసేపు బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఇంగ్లిష్‌ ఔటయ్యాకు ఆసీస్‌ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. కాగా బంగ్లా పర్యటనకు ముందు పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను కూడా 2-1 తేడాతో ఆస్ట్రేలియా కోల్పోయింది. మిచెల్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌, కమ్మిన్స్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
చదవండి: Vaibhav suryavanshi: మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement