ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. శ్రీలంక-ఎతో జరిగిన తొలి మ్యాచ్‌లో విఫలమై వైభవ్.. రెండో మ్యాచ్‌లో తనదైన శైలిలో వీరవిహారం చేశాడు. భారత్-ఎ తరపున బరిలోకి సూర్యవంశీ.. అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా అఫ్గాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్‌ప్లేలో అతడు వేసిన మూడు ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి ఔటయ్యాడు.
15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఇర్లాండ్, ఇంగ్లండ్, ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్నవయష్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
అఫ్గానిస్తాన్A: ఇమ్రాన్ మీర్ (కెప్టెన్),హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనివాల్, ఇజాజ్ అహ్మద్ అహ్మద్‌జాయ్, బహిర్ షా, ఇషాక్ రహీమి(వికెట్ కీపర్), ఖలీల్ గుర్బాజ్, జహీర్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, మహ్మద్ ఇబ్రహీం, ఫర్మానుల్లా సఫీ
ఇండియా A: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్గే, అర్షద్ ఖాన్, విప్రజ్ నిగమ్, అనుకుల్ రాయ్, అన్షుల్ కాంబోజ్
చదవండి: MPL 2026: సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ విధ్వంసం.. కేవలం 17 బంతుల్లోనే
It's Vaibhav Suryavanshi show against Afghanistan 👏
Vaibhav Sooryavanshi smashed 44 runs in just 22 balls vs Afghanistan A which included 9 fours at an strike rate of 200 💥
This 15 year old kid is just phenomenal and nightmare for the bowlers 🫡pic.twitter.com/wrRLpUezgS— Ajay Jadeja (@AjayJadeja171) June 11, 2026


