టీమిండియాను గడగడలాడించిన బౌలర్‌కు వన్డే అవకాశం | Jai Moondra earns ODI call-up, Paul Stirling returns for Afghanistan series | Sakshi
Sakshi News home page

టీమిండియాను గడగడలాడించిన బౌలర్‌కు వన్డే అవకాశం

Jul 28 2026 7:16 PM | Updated on Jul 28 2026 7:27 PM

Jai Moondra earns ODI call-up, Paul Stirling returns for Afghanistan series

source: X

త్వరలో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్‌ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇటీవల భారత టీ20 జట్టుపై సంచలన ప్రదర్శనలు చేసిన జై మూండ్రాకు చోటు దక్కింది. మూండ్రాకు ఇదే తొలి వన్డే అవకాశం.

గాయం కారణంగా భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులో చేరాడు. అతడే ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. 24 ఏళ్ల మీడియం పేసర్ బైరన్ మెక్‌డోనఫ్ తొలిసారి ఐర్లాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. గాయాలు, రికవరీ కారణంగా ఈ కింది ఆటగాళ్లు ఎంపికకు అందుబాటులో లేరు.

* జోష్ లిటిల్
* మ్యాట్ హోలార్డ్
* క్రెయిగ్ యంగ్
* బ్యారీ మెక్‌కార్తీ
* జోర్డాన్ నీల్
* డేవిడ్ డెలానీ

చివరి రెండు వన్డేల జట్టును ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను బట్టి తర్వాత ప్రకటిస్తారు.

తొలి మూడు వన్డేలకు ఐర్లాండ్ జట్టు..
* పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్)
* మార్క్ అదైర్
* ఆండ్రూ బాల్‌బిర్నీ
* బెన్ కాలిట్జ్
* కర్టిస్ క్యాంఫర్
* కేడ్ కార్మైకెల్
* జార్జ్ డాక్రెల్
* గావిన్ హోయ్
* ఆండ్రూ మెక్‌బ్రైన్
* లియమ్ మెక్‌కార్తీ
* బైరన్ మెక్‌డోనఫ్
* జై మూండ్రా
* హ్యారీ టెక్టర్
* లోర్కన్ టకర్

కాగా, ఐర్లాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగస్ట్‌ 5, 7, 10, 12, 14 తేదీల్లో జరుగనుంది. తొలి రెండు వన్డేలు బ్రీడీ వేదికగా జరుగనుండగా.. చివరి మూడు వన్డేలకు బెల్‌ఫాస్ట్‌ ఆతిథ్యమివ్వనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement