breaking news
Jai Moondra
-
టీమిండియాను గడగడలాడించిన బౌలర్‌కు వన్డే అవకాశం
త్వరలో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇటీవల భారత టీ20 జట్టుపై సంచలన ప్రదర్శనలు చేసిన జై మూండ్రాకు చోటు దక్కింది. మూండ్రాకు ఇదే తొలి వన్డే అవకాశం.గాయం కారణంగా భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులో చేరాడు. అతడే ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. 24 ఏళ్ల మీడియం పేసర్ బైరన్ మెక్‌డోనఫ్ తొలిసారి ఐర్లాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. గాయాలు, రికవరీ కారణంగా ఈ కింది ఆటగాళ్లు ఎంపికకు అందుబాటులో లేరు.* జోష్ లిటిల్* మ్యాట్ హోలార్డ్* క్రెయిగ్ యంగ్* బ్యారీ మెక్‌కార్తీ* జోర్డాన్ నీల్* డేవిడ్ డెలానీచివరి రెండు వన్డేల జట్టును ఆటగాళ్ల ఫిట్నెస్ను బట్టి తర్వాత ప్రకటిస్తారు.తొలి మూడు వన్డేలకు ఐర్లాండ్ జట్టు..* పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్)* మార్క్ అదైర్* ఆండ్రూ బాల్బిర్నీ* బెన్ కాలిట్జ్* కర్టిస్ క్యాంఫర్* కేడ్ కార్మైకెల్* జార్జ్ డాక్రెల్* గావిన్ హోయ్* ఆండ్రూ మెక్‌బ్రైన్* లియమ్ మెక్‌కార్తీ* బైరన్ మెక్‌డోనఫ్* జై మూండ్రా* హ్యారీ టెక్టర్* లోర్కన్ టకర్కాగా, ఐర్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 5, 7, 10, 12, 14 తేదీల్లో జరుగనుంది. తొలి రెండు వన్డేలు బ్రీడీ వేదికగా జరుగనుండగా.. చివరి మూడు వన్డేలకు బెల్ఫాస్ట్ ఆతిథ్యమివ్వనుంది. -
టీమిండియాను గడగడలాడించిన ఐర్లాండ్ బౌలర్‌కు బంపరాఫర్
ఇటీవల ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా బ్యాటర్లను గడగడలాడించిన బౌలర్‌కు బంపరాఫర్ వచ్చింది. విదేశీ లీగ్‌లో ఓ భారతీయుడు ఓన్ చేసుకున్న ఫ్రాంచైజీలో ఆడేందుకు అతడికి పిలుపు అందింది.వివరాల్లోకి వెళితే.. ఇటీవల టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించి 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను భారత జట్టు అనూహ్యంగా 0-2తో చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లను జై మూండ్రా అనే భారత మూలాలున్న (రాజస్థాన్) ఐర్లాండ్ బౌలర్ తెగ ఇబ్బంది పెట్టాడు.2 మ్యాచ్‌లో 5 ప్రధాన వికెట్లు (సంజూ శాంసన్‌ను రెండు సార్లు, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌ను తలోసారి) తీసి టీమిండియా సిరీస్ ఓటమికి కారకుడయ్యాడు. ఈ ప్రదర్శనల తర్వాత మూండ్రా క్రికెట్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లన్నీ ఇతడిపై కన్నేశాయి.ఈ క్రమంలోనే ఈ యువ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌ను యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) తొలి సీజన్ కోసం Rotterdam Dockers జట్టు తమ స్క్వాడ్‌లోకి తీసుకుంది. ఈ ఫ్రాంచైజీకి ప్రముఖ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం సహ యజమానిగా ఉన్నాడు. సౌతాఫ్రికా మాజీలు ఫాఫ్ డుప్లెసిస్, జాంటీ రోడ్స్, హెన్రిచ్ క్లాసెన్‌కు కూడా ఈ ఫ్రాంచైజీలో భాగముంది.యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఈ ఏడాదే తొలిసారి నిర్వహించబడనుంది. Cricket Ireland, Cricket Scotland, Royal Dutch Cricket Association సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి.ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనున్న ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. మొత్తం 32 మ్యాచ్‌లు (ప్లే ఆఫ్స్‌తో కలిపి) నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్‌లో నిర్వహించనున్నారు. ఈ లీగ్‌లో చాలామంది భారతీయ క్రికెటర్లు, బాలీవుడ్ సినీ రంగానికి చెందిన వారు సహ యజమానులుగా ఉన్నారు. -
టీమిండియాను గడగడలాడించిన మూంద్రా.. ఐపీఎల్లో బిగ్ డీల్..!
ఐర్లాండ్ తరఫున సంచలన అరంగేట్రం చేసిన భారత సంతతి యువ పేసర్ జై మూంద్రా ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. భారత్‌పై టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్న ఈ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్.. 2027 ఐపీఎల్ మినీ వేలంలో హాట్ ప్రాపర్టీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.రాజస్థాన్‌లోని టోంక్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించిన మూంద్రా.. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అనంతరం ఐర్లాండ్ దేశవాళీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. భారత్‌తో సిరీస్‌లో తొలి బంతికే వికెట్ తీసి ఆకట్టుకున్న అతడు.. మొత్తం సిరీస్‌లో భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.తొలి మ్యాచ్‌లో 25 పరుగులకు 2 వికెట్లు.. రెండో మ్యాచ్‌లో 32 పరుగులకు 3 వికెట్లు తీసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో మూంద్రాను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వద్ద మూంద్రా సంధించిన బంతులు సమాధానం లేదు. రెండో మ్యాచ్‌లో మూంద్రా అభిషేక్, సంజూను వారెదుర్కొన్న తొలి బంతులకు ఔట్ చేసి హైలైటయ్యాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను మరో అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.ఈ సంచలన ప్రదర్శనల తర్వాత మూంద్రాకు ఐపీఎల్లో భారీ గిరాకీ ఏర్పడింది. అతడి కోసం మూడు టాప్ ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీ ఏవి.. మూంద్రాకు మినీ వేలంలో ఎంత ధర లభించవచ్చు తదితర అంశాలను పరిశీలిద్దాం. మూంద్రా కోసం ముందుగా ఎగబడే అవకాశాలు ఉన్న ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్.ఈ ఫ్రాంచైజీ 2026 సీజన్లో బౌలింగ్ విభాగంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. దీంతో జట్టులోని విదేశీ పేసర్లలో మార్పులు చేసే అవకాశముంది. మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, లోకీ ఫెర్గూసన్లలో ఎవరో ఒకరిని తప్పించి మూంద్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. శ్రేయస్ మూంద్రా ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో యాజమాన్యం ఆసక్తి చూపవచ్చు. పంజాబ్ మూంద్రా కోసం రూ. 5 కోట్లైనా వచ్చించే అవకాశం ఉంది.కేకేఆర్ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో స్థిరత్వం లేక ఇబ్బందులు పడుతున్న కేకేఆర్‌కు జై మూంద్రా మంచి ఎంపికగా మారవచ్చు. మతీశ పతిరణ అందుబాటులో లేకపోవడం, బ్లెస్సింగ్ ముజరబానీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే మూంద్రా కోసం కేకేఆర్ ఎగబడే ఛాన్స్ ఉంది. కేకేఆర్ కూడా మూంద్రా కోసం ఇంచుమించు రూ. 5 కోట్లు ఖర్చు చేయవచ్చు.Mumbai Indians2026 సీజన్లో ముంబై ఇండియన్స్ పేస్ బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. బుమ్రా, దీపక్ చాహర్, బౌల్ట్, శార్దూల్ ఠాకూర్ ఆశించిన ప్రభావం చూపలేకపోవడంతో, జట్టు పునర్నిర్మాణంలో భాగంగా మూంద్రాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించడంలో పేరుగాంచిన ముంబై స్కౌటింగ్ వ్యవస్థకు జై మూంద్ర ఆకర్షణీయమైన ఎంపిక కావచ్చు. ఈ ఫ్రాంచైజీ మూంద్రా కోసం ఎంత ఖర్చు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. -
మళ్లీ నగుబాటే...
బెల్ఫాస్ట్: ఐర్లాండ్ పర్యటనలో భారత పురుషుల క్రికెట్ జట్టు పూర్తిగా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు ఛేదించలేక చతికిలబడిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో చిన్న లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. ఆదివారం జరిగిన రెండో టి20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. దీంతో ఐర్లాండ్ 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా ఐర్లాండ్‌కు టీమిండియాపై ఇదే తొలి సిరీస్ విజయం కాగా... టి20ల్లో వరుసగా 16 సిరీస్ విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ సాధించగా... బెన్ కాలిట్జ్ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... శివమ్ దూబే రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తిలక్ వర్మ (46 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జై ముంద్రా, హోలార్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ముంద్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గే అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేయగా... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. ఐర్లాండ్ పర్యటనను ముగించుకున్న భారత్... బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొననుంది. పారని అయ్యర్ పాచిక ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారనే నమ్మకంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ మాదిరిగానే ఈ సారి కూడా మన బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు. టిమ్ టెక్టర్ (5), రాస్ అడెయిర్ (16; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు నిలవలేకపోవడంతో... 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టకర్ (15) కూడా విఫలం కాగా... ఈ దశలో కాలిట్జ్ అండతో హ్యారీ టెక్టర్ కీలక పరుగులు సాధించాడు. చాపకింద నీరులా ముందుకు సాగిన టెక్టర్ జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్... తాజా ఐపీఎల్ అనంతరం అనూహ్య పరిణామాల మధ్య జట్టులోకి రావడంతో పాటు సారథ్య అవకాశం కూడా దక్కించుకున్నా మైదానంలో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు తీస్తున్న హర్షిత్ రాణా కోటా పూర్తి చేయించలేకపోయిన శ్రేయస్... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అభిషేక్, సామ్సన్ గోల్డెన్ డక్... ఈ మ్యాచ్‌లోనూ ఛేదనకే మొగ్గు చూపిన టీమిండియాకు తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన సంజూ సామ్సన్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోగా... నాలుగో బంతికి అభిషేక్ శర్మ (0) కూడా ‘గోల్డెన్ డకౌట్’గా వెనుదిరిగాడు. మూడో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10) కూడా అవుటయ్యాడు. ఈ మూడు వికెట్లు జై ముంద్రా ఖాతాలోకే వెళ్లాయి. ఇషాన్ కిషన్ (12) రనౌట్ రూపంలో వెనుదిరిగడంతో భారత జట్టు 35/4తో పీకల్లోతూ కష్టాల్లో పడింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో జట్టును గెలిపించిన అనుభవం ఉన్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకోగా... అతడికి అక్షర్ పటేల్ (14), శివమ్ దూబే (20) కాస్త సహకరించారు. దీంతో జట్టు గాడినపడ్డట్లే అనుకుంటుండగా... 18వ ఓవర్ రెండో బంతికి తిలక్ అవుటయ్యాడు. అరంగేట్ర ఆటగాడు సూర్యాన్ష్ (1) ప్రభావం చూపలేకపోగా... హర్షిత్ రాణా (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ప్రిన్స్ (6 నాటౌట్) సిక్స్ కొట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది.స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: టిమ్ టెక్టర్ (సి) అభిషేక్ (బి) రాణా 5; అడెయిర్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 16; హ్యారీ టెక్టర్ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 53; టకర్ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 15; కాలిట్జ్ (సి) తిలక్ (బి) దూబే 37; డెలానీ (బి) దూబే 0; డాక్రెల్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 19; మెక్‌కార్టీ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 2; జై ముంద్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–48, 4–113, 5–113, 6–144, 7–153, 8–154. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–35–2; హర్షిత్ రాణా 3–0–17–1; ప్రిన్స్ 4–0–22–3; శివమ్ దూబే 3–0–25–2; సూర్యాన్ష్ 2–0–25–0; అక్షర్ 4–0–28–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (ఎల్బీ) (బి) ముంద్రా 0; అభిషేక్ (సి) హోలార్డ్ (బి) ముంద్రా 0; ఇషాన్ (రనౌట్) 12; శ్రేయస్ (బి) ముంద్రా 10; తిలక్ (సి) మెక్‌కార్టీ (బి) హోలార్డ్ 55; అక్షర్ (సి) టకర్ (బి) హోలార్డ్ 14; శివమ్ దూబే (సి) డాక్రెల్ (బి) హంఫ్రీస్ 20; సూర్యాన్ష్ (సి) టిమ్ టెక్టర్ (బి) హోలార్డ్ 1; హర్షిత్ రాణా (సి) టిమ్ టెక్టర్ (బి) హ్యారీ టెక్టర్ 21; అర్ష్ దీప్ (నాటౌట్) 4; ప్రిన్స్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–19, 4–35, 5–74, 6–109, 7–117, 8–121, 9–147. బౌలింగ్: జై ముంద్రా 4–0–32–2; హంఫ్రీస్ 4–0–28–1; హోలార్డ్ 4–0–26–3; మెక్‌కార్టీ 4–0–22–0; హ్యారీ టెక్టర్ 4–0–40–1.


