ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మరోసారి తన చర్యలతో వార్తల్లో నిలిచాడు. శనివారం మెకే వేదికగా బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో స్మిత్ అంపైర్ల అగ్రహానికి గురయ్యాడు.
ఏమి జరిగిందంటే?
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో బంగ్లా పేసర్ టాస్కిన్ అహ్మద్.. స్మిత్‌కు బంతి స్టంప్స్ పైనుంచి చాలా ఎత్తుగా వెళ్తోంది" అంటూ స్మిత్ వారితో అన్నాడు. అంతేకాకుండా ధైర్యముంటే డీఆర్‌ఎస్ తీసుకుండి అని బంగ్లా కెప్టెన్ రెచ్చగొట్టాడు.
కానీ షాంటో మాత్రం రివ్యూ తీసుకోలేదు. అయినప్పటికి ఫీల్డింగ్ జట్టు నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా వ్యవహరించినందుకు ఆన్-ఫీల్డ్ అంపైర్లు స్టీవ్ స్మిత్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకుముందు జరిగిన తొలి టెస్టులో కూడా బంగ్లా ఆటగాళ్లతో స్మిత్ మైండ్ గేమ్స్ ఆడాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తొలుత బంగ్లా జట్టును బ్యాటింగ్ అహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో దారుణ ప్రదర్శన కనబరిచారు. ఆసీస్ బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.
అనంతరం ఆసీస్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కంగారులు 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. గ్రీన్(51),లియోన్(10) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. స్మిత్ 42 పరుగులతో రాణించాడు. బంగ్లాపేసర్ షోరిఫుల్ ఇస్లాం 6 వికెట్లతో ఆసీస్ టాపార్డర్‌ను దెబ్బ తీశాడు.
చదవండి: సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ షాక్.. ఒకవేళ అదే జరిగితే?
— Markie (@Markie49SSAlt) August 22, 2026
THE SLIMMEST DISMISSAL OF LBW FOR STEVE SMITH.
- A marginal touch sends Steve Smith. pic.twitter.com/VBMYSN3anV— Maina Singh (@Maina_Singhx77) August 22, 2026


