PC: Bangladesh Cricket X
బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంతకు ముందు బంగ్లా బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడుతోంది.
ఆరేసిన మహమూద్
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లా మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత డార్విన్‌లోని మరారా స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. అనూహ్య రీతిలో 198 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేసింది.
ఆది నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు బంగ్లా పేసర్ హసన్ మహమూద్. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23)లతో పాటు.. స్టీవ్ స్మిత్ (71) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియాన్ (7) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

తొలి బంగ్లా బౌలర్‌గా
మొత్తంగా ఆసీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మహమూద్.. 17 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డ మీద టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.
ముఖాముఖి పోరులో హీరోగా..
అదే విధంగా.. ఆసీస్- బంగ్లా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా 26 ఏళ్ల మహమూద్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ పేసర్ జేసన్ గిల్లెస్పి పేరిట ఉండేది. 2003లో గిల్లెస్పి బంగ్లాదేశ్‌తో టెస్టులో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. మహమూద్ తాజాగా అతడిని అధిగమించాడు.
ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు
1. మైకేల్ కాస్ప్రోవిక్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 7/39
2. హసన్ మహమూద్ (బంగ్లాదేశ్)- 2026లో ఆస్ట్రేలియా మీద 6/55
3. చమిందా వాస్ (శ్రీలంక)- 2004లో ఆస్ట్రేలియా మీద 5/31
4. గ్లెన్ మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 5/37
5. స్టువర్ట్ మెక్‌గిల్ (ఆస్ట్రేలియా)- 2003లో బంగ్లాదేశ్ మీద 5/65.
చదవండి: వైభవ్ విషయంలో అది నేను అంగీకరించను: ఆసీస్ దిగ్గజం
Hasan Mahmud’s 6-Wicket Haul vs Australia | 1st Test 🔥🇧🇩 pic.twitter.com/5qaJN4qTss
— Bangladesh Cricket (@BCBtigers) August 13, 2026


