చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌ | Mitchell Starc Creates History: Becomes Highest Wicket-Taker Among Left-Arm Bowlers in Test Cricket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

Aug 13 2026 12:57 PM | Updated on Aug 13 2026 1:05 PM

HISTORY BY MITCHELL STARC, He has now most wickets by a left arm bowler in Test Cricket

source: X

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో షద్మాన్ ఇస్లామ్‌ను ఔట్ చేయడంతో టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు (434) తీసిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రంగన హెరాత్‌ను (433) అధిగమించాడు.

ఇదివరకే లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లలో అత్యధిక వికెట్ల వీరుడిగా చలామణి అవుతున్న స్టార్క్‌కు ఇది మరో చారిత్రక మైలురాయి. స్టార్క్‌ 414 వికెట్లు తీసిన పాక్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పీడ్‌ గన్‌ వసీం అక్రం (414) రికార్డును కొన్ని మ్యాచ్‌ల ముందే అధిగమించాడు.

ప్రస్తుతం ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ల జాబితాలో స్టార్క్‌ (106 టెస్ట్‌ల్లో 434 వికెట్లు) అగ్రస్థానంలో నిలువగా.. రంగన హెరాత్‌ (93 టెస్ట్‌ల్లో 433), వసీ​ం అక్రం​ (104 టెస్ట్‌ల్లో 414), డేనియల్‌ వెటోరీ (113 టెస్ట్‌ల్లో 362), చమింద వాస్‌ (111 టెస్ట్‌ల్లో 355) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళే ప్రారంభమైన తొలి టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. హసన్‌ మహమూద్‌ (6-55), తస్కిన్‌ అహ్మద్‌ (2-55), ఎబాదత్‌ హొసేన్‌ (2=39) ధాటికి 198 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ తరఫున స్టీవ్‌ స్మిత్‌ (71) ఒంటరిపోరాటం చేశాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను స్టార్క్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. 36 పరుగుల జట్టు స్కోర్‌ వద్ద స్టార్క్‌ బౌలింగ్‌లో లియోన్‌కు క్యాచ్‌ ఇచ్చి షదాన్‌ ఇస్లాం (20) ఔటయ్యాడు. ప్రస్తుతం బంగ్లా స్కోర్‌ 58-1గా ఉంది. తంజిద్‌ హసన్‌ (19), మొమినుల్‌ హక్‌ (12) క్రీజ్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement