WTC : కీలక మలుపు.. బంగ్లా ఓటమితో భారత్‌కు లక్కీ చాన్స్‌! | Bangladesh 2nd Test Loss To Australia Boosts India WTC Final Hopes, Here's The Complete Qualification Scenario | Sakshi
Sakshi News home page

WTC 2025-27: కీలక మలుపు.. బంగ్లా ఓటమితో భారత్‌కు లక్కీ చాన్స్‌!

Aug 23 2026 1:32 PM | Updated on Aug 23 2026 3:50 PM

Bangladesh Loss-Vs AUS-2nd-Test-India-Benefit-Reach-WTC-Final Chances

Photo Credit: BCCI Twitter

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో తొలి టెస్టులో భారీ విజ‌యం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఆసీస్ బౌల‌ర్ల ధాటికి ఇన్నింగ్స్ 51 ప‌రుగుల‌ తేడాతో ప‌రాజ‌యం మూటగ‌ట్టుకున్న బంగ్లాదేశ్ డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో స్థానం మార‌న‌ప్ప‌టికీ, పాయింట్లు భారీగా కోల్పోయింది. 

మ‌రోవైపు ఆస్ట్రేలియా మాత్రం రెండో టెస్టులో విజ‌యంతో  80 పాయింట్లు సాధించి డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో త‌న తొలి స్థానాన్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంది. ఇక రెండో స్థానంలో సౌతాఫ్రికా (75 పాయింట్లు) ఉండ‌గా, 72.22 పాయింట్ల‌తో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొన‌సాగుతోంది. బంగ్లాదేశ్ ఓట‌మి త‌ర్వాత భార‌త్‌కు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరేందుకు అవ‌కాశాలు ఎంత ఉన్నాయి? ఏ లెక్క‌న భార‌త్ ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తుంద‌నేది మ‌రోసారి తెలుసుకుందాం.

పాయింట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ 66.6 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో కొన‌సాగుతూ వస్తోంది. అయితే రెండో టెస్టులో ఓట‌మి త‌ర్వాత బంగ్లాదేశ్ 11.1 పాయింట్లు కోల్పోయి 55.5 పాయింట్ల‌కు ప‌రిమిత‌మైంది. అదే స‌మ‌యంలో తొలి టెస్టులో భారీ విజ‌యం సాధించిన టీమిండియా ఐదో స్థానంలో కొన‌సాగుతుండ‌గా, భార‌త్ ఖాతాలో 53.3 పాయింట్లు ఉన్నాయి.

ఒక‌వేళ లంక‌తో రెండో టెస్టులో టీమిండియా విజ‌యం సాధిస్తే డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో బంగ్లాను అధిగ‌మించి నాలుగో స్థానానికి చేరుకుంటుంది. లంక‌తో టెస్టు సిరీస్ త‌ర్వాత 2025-27 డ‌బ్ల్యూటీసీ సైకిల్‌లో మ‌రో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్ప‌టికే ప‌ది టెస్టులాడిన భార‌త్ నాలుగింట ఓడిపోయింది. లంక‌తో సిరీస్ అనంత‌రం న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ రెండు టెస్టులు ఆడ‌నుంది. 

ఎనిమిదిలో ఏడు గెలిస్తేనే..
ఆ త‌ర్వాత ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు క‌ఠినమైన సిరీస్‌లు కావ‌డం భార‌త్‌కు ఇబ్బంది క‌లిగించే అంశం. అయితే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడాలంటే భార‌త్ త‌మ‌కు మిగిలిన 8 టెస్టుల్లో క‌నీసం ఏడింటిలో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే డ‌బ్ల్యూటీసీ ప‌ట్టిక‌లో 68.52 ప‌ర్సంటైల్‌తో ఉంటుంది. ఒక‌వేళ ఆరు విజ‌యాలు, రెండు ఓట‌ములు ఎదురైతే అప్పుడు 62.96 పాయింట్ల‌కు ప‌రిమిత‌మ‌వుతుంది. 

భారత్‌కు రెండే దారులు..
ఈ రెండు దారులు త‌ప్ప టీమిండియా ఫైన‌ల్ చేరేందుకు మ‌రో అవ‌కాశం లేదు. అయితే రాబోయే 8 టెస్టుల్లో ఒక పెనాల్టీ పాయింట్ వ‌చ్చినా టీమిండియా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్తంత‌యిన‌ట్లే. కాబ‌ట్టి గిల్ సేన ముచ్చ‌ట‌గా మూడోసారి డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆడాల‌నుకుంటే మాత్రం ప్ర‌తీ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల్సిన అవ‌స‌ర‌ముంది.

Read: జైస్వాల్, లంక బౌల‌ర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement