స్టార్క్‌ దెబ్బకు బంగ్లాదేశ్‌ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి | Starc-Feat-Never-Seen-Before-149 years-Test Cricket History-BAN 2nd Test | Sakshi
Sakshi News home page

AUS Vs BAN 2nd Test: స్టార్క్‌ దెబ్బకు బంగ్లాదేశ్‌ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి

Aug 22 2026 7:58 AM | Updated on Aug 22 2026 8:07 AM

Starc-Feat-Never-Seen-Before-149 years-Test Cricket History-BAN 2nd Test

Photo Credit: Twitter

ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ మాకే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి టెస్టులో అనూహ్య ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో మాత్రం నంబర్‌వన్ ఆటను ప్రదర్శిస్తోంది. మిచెల్ స్టార్క్(6-4-5-5) బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. 

ఫలితంగా బంగ్లాదేశ్ 21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇందులో స్టార్క్ ఖాతాలో ఐదు వికెట్లు ఉండ‌గా, క‌మిన్స్‌కు ఒక వికెట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే స్టార్క్  149 టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌ను తిర‌గ‌రాశాడు. అదేంటంటే, టెస్టు మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్ తొలి బంతికే వికెట్ తీయ‌డం స్టార్క్‌కు ఇది నాలుగో సారి. 

గ‌తంలో క‌రుణ‌ర‌త్నే (2016లో), రోరీ బ‌ర్న్స్ (2021లో), జైస్వాల్ (2024లో) తొలి బంతికే ఔట్ చేశాడు. వెస్టిండీస్ బౌల‌ర్ పెడ్రో కొలిన్స్ కూడా టెస్టుల్లో మూడుసార్లు తొలి ఓవ‌ర్ తొలి బంతికే వికెట్ తీశాడు. తాజా ఫీట్‌తో కొలిన్స్‌ను అధిగ‌మించిన స్టార్క్ తొలి స్థానంలో  నిలిచాడు. దీంతో పాటు టెస్టుల్లో తొలి ఓవ‌ర్‌లో స్టార్క్ వికెట్ తీయ‌డం ఇది 28వ సారి కావ‌డం విశేషం.

ఇక స్టార్క్ త‌న తొలి నాలుగు ఓవ‌ర్ల‌లో ఓవ‌ర్‌కు ఒక వికెట్ చొప్పున తీశాడు. కేవ‌లం 22 బంతుల్లోనే స్టార్క్ ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో స్టార్క్ రెండోసారి టెస్టుల్లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల హాల్ సాధించాడు. గ‌తంలో స్టార్క్ 2025లో వెస్టిండీస్‌తో టెస్టులో 15 బంతుల వ్య‌వ‌ధిలోనే ఐదు వికెట్ల మార్క్ అందుకోవ‌డం విశేషం. స్టార్క్ త‌ర్వాత ఎరిన్ టోష‌క్ (1947లో భార‌త్‌పై), స్టువ‌ర్ట్ బ్రాడ్ (2015లో ఆసీస్‌పై), స్కాట్ బోలండ్ (2021లో ఇంగ్లండ్‌పై)లు 19 బంతుల వ్య‌వ‌ధిలో ఐదు వికెట్ల హాల్ న‌మోదు చేసి రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.

ఇక టాస్ గెలిచిన క‌మిన్స్ బంగ్లాదేశ్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాసేప‌టికే పిచ్ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది బంగ్లాకు పూర్తిగా అర్ధ‌మైంది. స్టార్క్ నిప్పులు చెరిగే బంతుల‌కు తోడు క‌మిన్స్‌, హాజిల్‌వుడ్‌లు చెరో ఎండ్ నుంచి త‌మ పేస్ అటాకింగ్‌తో ఇబ్బంది పెట్ట‌డంతో బంగ్లాదేశ్ కోలుకోలేక‌పోయింది. లంచ్ విరామ స‌మయానికి బంగ్లాదేశ్ 23 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులతో ఆడుతోంది. హ‌స‌న్ మ‌హ్ముద్ (8), మెహ‌దీ హ‌స‌న్ (11) క్రీజులో ఉన్నారు.

 

Read: మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీర‌జ్ చోప్రాకు ర‌జ‌తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement