ఆసీస్‌ సిరీస్‌ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా | Bangladesh pick Hridoy in Test squad, recall pace trio for Australia T20Is | Sakshi
Sakshi News home page

ఆసీస్‌ సిరీస్‌ కోసం ప్రత్యేక అస్త్రాలు సిద్దం చేసిన బంగ్లా

Jun 11 2026 5:39 PM | Updated on Jun 11 2026 5:47 PM

Bangladesh pick Hridoy in Test squad, recall pace trio for Australia T20Is

త్వరలో ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఆతర్వాత జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం రెండు వేర్వేరు బంగ్లాదేశ్‌ జట్లను ఇవాళ (జూన్‌ 11) ప్రకటించారు. ముందుగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ విషయానికొస్తే.. ఈ జట్టుకు కెప్టెన్‌గా లిట్టన్‌ దాస్‌ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా యువ బ్యాటర్‌ తౌహిద్‌ హృదోయ్‌ పేరును ప్రకటించారు.

ఈ సిరీస్‌తో పేస్‌ త్రయం ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, నహిద్‌ రాణా రీఎంట్రీ ఇచ్చింది. ఈ ముగ్గురు పేసర్లతో బంగ్లాదేశ్‌ ఆసీస్‌ బ్యాటింగ్‌ యూనిట్‌పై దాడికి దిగనుంది. ఈ జట్టులో గత సిరీస్‌లో ఆడిన తంజిమ్‌ హసన్‌ షకీబ్‌, రిపన్‌ మొండల్‌, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌లకు చోటు దక్కలేదు. వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంగా వీరిని తప్పించినట్లు సెలెక్టర్లు చెప్పారు.

జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌ విషయానికొస్తే.. నజ్ముల్‌ హసన్‌ షాంటో కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. దేశవాలీ టోర్నీల్లో విశేషంగా రాణిస్తున్న తౌహిద్‌ హృదోయ్‌ టెస్ట్‌ జట్టులో కూడా చోటు దక్కించుకున్నాడు. సీనియర్లు ముష్ఫికర్‌ రహీం, లిటన్‌ దాస్‌, మొమినుల్‌ హక్‌ జట్టులో చోటు నిలుపుకున్నారు. కొత్త పేసర్‌ రోబివుల్‌ హాక్‌కు అవకాశం లభించింది.

ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ జూన్‌ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌ వేదికగా జరుగనుండగా.. జింబాబ్వేతో ఏకైక టెస్ట్‌ జూన్‌ 28 నుంచి హరారేలో జరుగనుంది.

ఆస్ట్రేలియా సిరీస్‌కు బంగ్లా టీ20 జట్టు: లిటన్ కుమార్ దాస్ (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తంజిద్ హసన్, మహ్మద్ సైఫ్ హసన్, షమీమ్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్ (వైస్ కెప్టెన్), నూరుల్ హసన్ సోహన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, రిషద్‌ హొసేన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, నహిద్ రాణా, అబ్దుల్ గఫార్ సక్లైన్.

జింబాబ్వేతో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్‌ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ కుమార్ దాస్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్, ఇబాడోత్ హొసేన్‌, హసన్‌ మహమూద్‌, తౌహిద్‌ హృదోయ్‌, అమిటే హసన్‌, రోబివుల్‌ హాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement