జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 17) జరిగిన రెండో టీ20లో పర్యాటక జింబాబ్వే 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకొని, సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టీ20లో జింబాబ్వే బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హస్సన్ (55), తంజిద్ హసన్ తమీమ్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో యాసిర్ అలీ (22 నాటౌట్), సైఫుద్దీన్ (31 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ, ఈవాన్స్ తలో 2 వికెట్లు తీయగా.. సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. రిషద్ హొస్సేన్ (4-26), మెహిది హసన్ (3-24) ధాటిఇ 19.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా, సైఫుద్దీన్ , సైఫ్ హస్సన్ తలో వికెట్ తీశారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. సికందర్ రజా (28), బ్రాడ్ ఈవాన్స్ (25), ర్యాన్ బర్ల్ (29) తేలికపాటి మెరుపులు మెరిపించారు.
నిర్ణయాత్మక మూడో టీ20 జులై 19న జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో, ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో జింబాబ్వే బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. ఏకైక టెస్ట్ మ్యాచ్ గెలవడంతో పాటు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.


